Zomato Delivery Boy: మార్కెటింగ్ రంగంలో ఉండే బాయ్స్‌కు తప్పనిసరిగా బైక్ అనే నిబంధన ఉంటుంది. చాలా కంపెనీలు రిక్రూట్‌మెంట్ సమయంలోనే బైక్, డ్రైవింగ్ లైసెన్స్ అడుగుతాయి. అవి ఉంటేనే ఉద్యోగం ఇస్తాయి. అతిపెద్ద ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో కూడా అంతే. అయితే ఓ బాయ్ తన రూ.10 లక్షల విలువైన బైక్‌పై ఫుడ్ డెలివరీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రూ.10 లక్షల బైక్‌పై జొమాటో ఫుడ్ డెలివరీ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది.
నిత్యం వార్తల్లో జొమాటో..
జొమాటో నిత్యం ఏదో రకంగా వార్తల్లో ఉంటుంది. జొమాటోలో పనిచేసే ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటీవ్స్ కూడా వార్తల్లోకి వస్తుంటారు. జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ పాజిటివ్ లేదా నెగటివ్ సందర్భాల్లో వార్తల్లోకి వస్తుంటారు. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంటారు. ఇదేమి కొత్త కాదు. లేటెస్ట్‌గా ఇన్‌స్టాగామ్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. అతను ఏకంగా రూ.10 లక్షల విలువైన బైక్‌పై ఫుడ్ డెలివరీ చేస్తుండటం ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియోలో సదరు వ్యక్తిని మీరు బతకడానికి ఏం చేస్తుంటారు? అని మరో వ్యక్తి అడిగితే అతను సమాధానం చెప్పిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది.
ఒక్కో డెలివరీకి రూ.200
తాను జొమాటోలో ఫుడ్ డెలివరీ ఎగ్జిక్యూటీవ్‌గా పనిచేస్తున్నానని, డుకాటి బైక్‌పై కూర్చున్న వ్యక్తి దర్జాగా చెప్పాడు. అంతే కాదు… జొమాటో నుంచి తాను ఎలా సంపాదిస్తున్నానో కూడా వివరించాడు. జొమాటో తనకు ఒక్కో డెలివరీకి రూ.200 చెల్లిస్తుందని, రూ.50 పెట్రోల్‌కు ఖర్చయిపోయినా, ఒక్కో ఆర్డర్‌పై రూ.150 మిగుల్తుందని చెప్పాడు. రోజూ 20 వరకు ఆర్డర్స్ డెలివరీ చేస్తానని చెప్పాడు. నెలకు రూ.45,000 వరకు సంపాదిస్తానని వీడియోలో సదరు వ్యక్తి వివరించడం ఆ వీడియో చూడొచ్చు.
స్పందించిన బైక్ కంపెనీ
ఇన్‌స్టాగామ్‌లో Raj Gothankar పేరుతో ఉన్న ప్రొఫైల్‌లో ఈ వీడియో పోస్ట్ అయింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. డుకాటి ఇండియా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఈ వీడియోకు స్పందించింది. ఎమోజీతో కామెంట్స్ చేసింది. అయితే ఇది కామెడీ కోసం చేసిన వీడియోలా కనిపిస్తోంది. ఇది తన బైక్ కాదని, ఒకట్రెండు సంవత్సరాల్లో డుకాటి మాన్‌స్టర్ బైక్ కొంటానని సదరు క్రియేటర్ కామెంట్ చేశాడు.