చైనాలో కనిపించిన ఓ చేప అచ్చం మనిషి ముఖాన్ని పోలి ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
చైనాలోని మియో గ్రామానికి వెళ్లిన ఓ మహిళకు అక్కడి నీటి ప్రవాహంలో ఈ చేప దర్శనమిచ్చినట్లు ఆంగ్ల ప్రతికలు పేర్కొన్నాయి. నీళ్లలో చేప వస్తున్న వీడియోను తీసిన మహిళ వెంటనే చైనా మైక్రోబ్లాగింగ్ సైట్ వీబోలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయింది. నీటిలో ఈదుకొంటూ వస్తున్న చేప ముందు భాగం మనిషిని పోలినట్లు కళ్లు, ముక్కు, నోరు కనిపించాయి. ఈ చేపను చూసిన నెటిజన్‌లు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే ఈ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ‘ఇది నిజంగా భయానకం’, ‘ఈ చేపను తినడానికి ఎవరికైనా ధైర్యముందా’ అంటూ వరుస కామెంట్లు పెడుతున్నారు. ఆ చేపను మీరూ చూసేయండి.
