Bigg Boss 9 Telugu Shreshti Varma Elimination : ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి అడుగుపెట్టే ముందే ఆడియన్స్ అందరికీ ఎవరెవరు హౌస్ లోకి రాబోతున్నారో తెలిసింది. వారిలో శ్రేష్టి వర్మ రాబోతుంది అని తెలియగానే, పర్లేదే స్ట్రాంగ్ కంటెస్టెంట్ నే పంపించారు, హౌస్ లో ఈమె గొడవలు పడగలదు, ఆటలు కూడా బాగా ఆడగలదు అని అంతా అనుకున్నారు. కానీ ఆమెకి కంటెంట్ ఇవ్వడానికి అంతగా స్కోప్ దొరక్కపోవడం తో ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చిందని అంటున్నారు విశ్లేషకులు. అయితే శ్రేష్టి వర్మ ఎలిమినేట్ అవ్వడం న్యాయం కాదు, ఆమె కంటే హౌస్ లో అసలు ఏమి చెయ్యకుండా ఖాళీగా కూర్చున్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు నామినేషన్స్ లోకి వస్తే కచ్చితంగా ఎలిమినేట్ అవుతారని అంతా అనుకున్నారు కానీ, వాళ్ళే చివరికి సేవ్ అయ్యారు. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం. అయితే శ్రేష్టి వర్మ ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం.
ముందుగా ఆమెకు మిగిలిన కంటెస్టెంట్స్ అందరితో పోలిస్తే ఫ్యాన్ బేస్ చాలా తక్కువ. ఎందుకంటే ఈమె పెద్దగా ముఖ పరిచయం లేని అమ్మాయి. జానీ మాస్టర్ మీద కేసు వెయ్యడం వల్ల ఈమె పేరు బాగా వైరల్ అయ్యింది కానీ, అది ఆమెకు బాగా నెగిటివ్ చేసింది. ఆమె ఎవరో తెలిసిన ఆడియన్స్ కూడా ఓట్లు వెయ్యలేదు. ఇదే ఆమె ఎలిమినేట్ అవ్వడానికి ప్రధాన కారణం అయ్యింది. అంతే కాకుండా ఈమెకు కంటెంట్ ఇచ్చే స్కోప్ కూడా మొదటి వారం లో రాలేదు. ఎక్కువ శాతం కంటెంట్ ఇమ్మానుయేల్, భరణి, తనూజ, మాస్క్ మ్యాన్ హరీష్, సంజన,మనీష్ వంటి కంటెస్టెంట్స్ చుట్టూనే కంటెంట్ తిరిగింది. ఒకవేళ ఈమెకు ఏదైనా టాస్క్ పడి, బాగా ఆడుంటే కచ్చితంగా ఎలిమినేట్ అయ్యేది కాదేమో. ఎందుకంటే ఈమె టాస్కులను చాలా బాగా ఆడగలదు.
టాస్క్ ఆడే అవకాశాన్ని సంజన కల్పించింది కానీ, ఈమెకు సపోర్టు గా వేరే కంటెస్టెంట్ ఆడాల్సి వచ్చింది. అందుకే ఈమెకు ఉపయోగపడే ఫుటేజీ రాలేదు. ఈమె కనిపించింది కేవలం ఇంటిని ఊడవడం, అదే విధంగా సంజన ని సిగ్గు లేదా అని తిట్టినప్పుడు మాత్రమే. వాటిని కూడా ఈమె పెద్ద కంటెంట్ లాగా మార్చుకోలేకపోయింది. అందుకే ఎలిమినేట్ అయ్యింది అనుకోవచ్చు. ఏది ఏమైనా ఒక మంచి కంటెస్టెంట్ తన టాలెంట్ ని నిరూపించుకునే ముందే ఎలిమినేట్ అయ్యిందని ఈమెని అభిమానించే వాళ్ళు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఒక్క వారం ఈమె హౌస్ లో ఉన్నందుకు దాదాపుగా లక్షా 50 వేల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ ని అందుకున్నట్టు సమాచారం. ఎక్కువ వారాలు కొనసాగి ఉండుంటే కనీసం 20 లక్షల రూపాయిలు అయినా సంపాదించి ఉండేది అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు అంటున్నారు.