1977 Lok Sabha Election Results : 1977 లోక్ సభ ఎన్నికలు.. ఎమెర్జెన్సీని తీసివేయకుండానే ఎన్నికలు జరిపి గెలవాలనుకున్న ఇందిరాగాంధీ ప్రయత్నాలు నాడు కలకలం రేపాయి. ఆ ఎన్నికల్లో ప్రతిపక్షాల నేతలంతా జైల్లో ఉన్నారు. ఆ సమయంలో ఈజీగా గెలుస్తానని ఇందిరాగాంధీ అనుకున్నారు. కానీ దిమ్మదిరిగే ఫలితాలు వచ్చాయి.
కొన్ని ప్రమాద ఘంటికలు మోగాయి. 154 సీట్లు కాంగ్రెస్ కు వచ్చాయి. అలయెన్స్ కలుపుకుంటే 200 వరకూ వచ్చాయి. జనతా పార్టీకి 295 సీట్లు వచ్చాయి. కమ్యూనిస్టు, ఇతర పార్టీలకు ఇంకొన్ని వచ్చాయి. దేశవ్యాప్త ప్రజా తిరుగుబాటు నాడు జరగలేదు.
కొన్ని ప్రాంతాల్లో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రజలు నడవకపోతే ఇందిరాగాంధీ గెలిచేది. హిందీ రాష్ట్రాలు, బెంగాల్ లో ఇందిరాగాంధీ ఓడిపోయింది. హిందీ బెల్ట్ లో మొత్తం జనతా పార్టీ గెలిచింది. కేంద్రంలో అధికారాన్ని జనతాపార్టీకి దక్కేలా చేశాయి.
దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచింది. ఇందిరాగాంధీకి దక్షిణాది వెంట నిలిచింది. ప్రజాస్వామ్యం కూనీ కావడానికి ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ తోడ్పాటునందించాయి.ఇందిర కాంగ్రెస్ కు సీట్లు దక్కాయి. మహారాష్ట్ర, గుజరాత్ లో చెరిసగం వచ్చాయి. హిందీ ప్రజల వల్లే దేశంలో ప్రజాస్వామ్యం నిలబడింది.
1977 లోక్ సభ ఎన్నికల ఫలితాలను మరోసారి పరిశీలిద్దామా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూద్దాం
