Revanth Reddy Lifetime Achievement: “బాస్ ఈస్ ఆల్వేస్ కరెక్ట్” అనే విధానం ఎవరు అవలంభిస్తారో వారికి ఏ రంగంలోనూ ఎదురుండదు అనేది నిత్య సత్యం. ముఖ్యంగా ఎదిగే నాయకులకు ఉండాల్సిన ప్రధాన లక్షణం అధినేతకు విధేయులుగా ఉండడం. అప్పుడే ఆ రంగంలో మనుగడ సాధ్యమవుతుంది. అయితే అధినేత పట్ల విధేయత చాటుకునేందుకు సమయం సందర్భం ఉండాలి. ఆ సమయం వచ్చినప్పుడు ఏ స్థాయిలో మీ విధేయత చాటుతారో ఆ స్థాయిలో మీకు అంతర్గతంగా, బహిరంగంగా మద్దతు ఉంటుందనే రహస్యం తెలిసిన నాయకుడు రేవంత్ రెడ్డి. అధినేతకు విధేయత గా ఉండడం రేవంత్ రెడ్డికి అనుభవపూర్వకంగా వచ్చిన ఉన్నతమైన లక్షణం.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ఊహాగానాలకు ఒకే స్టెప్పుతో చెక్ పెట్టేశాడు. అధిష్టానం రేవంత్ విషయంలో అసంతృప్తితో ఉన్నారు, ముఖ్యమంత్రిని మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఆయన డిల్లీ వెళితే వారి అధినాయకత్వం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అని మీడియాలో వ్యతిరేక పార్టీ నాయకుల వ్యాఖ్యలను తిప్పికొట్టారు.
ఆన్నిటికీ ఏకైక పరిష్కారం హైకమాండ్. వారితో ఏవిధంగా వ్యవహరించాలో ముఖ్యమంత్రికి తెలిసినంతగా రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులకు కూడా తెలియదని డిల్లీలో జరిగిన కుల గణన పై ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన సమావేశంలో ఆయన వ్యవహరించిన తీరును చూస్తే అర్థమవుతుంది. ముఖ్యమంత్రిగా హుందాను ఒకవైపు ప్రదర్శిస్తూనే, మరోవైపు అధినాయకత్వంపై తనకున్న అభిమానాన్ని ఎలాంటి భేషజాలు లేకుండా వేదికపైన ప్రదర్శించడం కనిపించింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తనను మెచ్చుకుంటూ రాసిన లేఖను చూపిస్తూ ఆ లేఖ తనకు ఒక నోబెల్ బహుమతిగా, ఒక ఆస్కార్ అవార్డుగా భావిస్తున్నట్లు ప్రకటించారు. ఆ మాటలకు వేదిక కింద ఉన్న రాహుల్, ప్రియాంకలను ఇప్రెస్ చేశాయనడంలో సందేహం లేదు. వారు ఆయన మాటలకు స్పందిస్తూ చిరునవ్వులు చిందిస్తూ, కారచాలనం చేసి మరీ అభినందించడం చూశాం.
Also Read: ఇన్నాళ్లకు రేవంత్ ప్రభుత్వానికి పాత్రికేయులు గుర్తుకొచ్చారు..
నాయకుడిగా ఎదగాలంటే చేయాలంటే, అధినాయకుడి ఎపుడూ కార్యకర్తగా మెలగాలి. లేకుంటే రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరమౌతుందని అందరు తీసుకోవాల్సిన సత్యం. అలాగే అధినాయకత్వానికి తాను అత్యంత సన్నిహితుడనని, ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా, నష్టపోయేది మీరేనని కూడా ఎగిరెగిరి పడుతున్న సీనియర్ నాయకులకు ఈ విధంగా ఒక సందేశం ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఏది ఏమైనా రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా హైకమాండ్ ఆశీస్సులు ఉన్నంతవరకు ఏది జరగదు అనే విషయం తేటతెల్లమైంది.