India vs Pakisthan: పాకిస్తాన్.. మన దేశంతో అభివృద్ధిలో పోటీ పడలేదు. సౌకర్యాల కల్పనలో ముందుకు రాలేదు. కనీసం తాగునీరు కూడా అందించలేదు. నడవడానికి రోడ్లు కూడా నిర్మించలేదు. కానీ అల్లకల్లోలం సృష్టించడంలో ముందుంటుంది. మనుషుల మధ్య చిచ్చులు పెట్టడంలో.. క్రూరంగా చంపడంలో అగ్రస్థానంలో ఉంటుంది. ఉగ్రవాదులతో చేతులు కలిపి మనదేశంలో ఎన్నో దారుణాలకు పాల్పడింది పాకిస్తాన్.
పాకిస్తాన్ మనదేశంలో ఎన్నో అకృత్యాలు చేసింది. ఎన్నో ఘోరాలకు పాల్పడింది. గత ఏడాది నవంబర్ 10వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదంలో మరణాలు నమోదయ్యాయి. చాలామంది గాయపడ్డారు కూడా. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు ఇప్పుడు కొత్త నిజాన్ని బయటపెట్టారు.
ఈ ఘటన వెనుక పాకి ప్రేరేపిత వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ ఉందని అధికారులు బయటపెట్టారు. పాకిస్తాన్ నుంచి ఈ ఘోరానికి పాల్పడేందుకు కీలక వ్యక్తులు కోడ్ భాషలో ఉగ్రవాదుల రూపంలో ఉన్న వైద్యులకు సందేశాలు పంపినట్టు గుర్తించారు. ఘోస్ట్ సిమ్ వినియోగించిన ఉగ్రవాదులు.. పాకిస్తాన్ లో ఉన్న మాస్టర్ మైండ్ ల నుంచి వాట్సప్, టెలిగ్రామ్ లో కోడ్ సందేశాలు అందుకున్నట్టు తెలుస్తోంది.
ఈ కర్ణకి పాల్పడిన డాక్టర్ ముజమ్మిల్ గనాయి, ఆదిల్ రాధర్ ఇతర నిందితులు ఈ సందేశాలను అందుకున్నారు. దీనికోసం వారు డ్యూయల్ ఫోన్ ప్రోటోకాల్ విధానాన్ని అనుసరించారు. బాంబు పేలుడులో కీలకంగా ఉన్నవారు రెండు మూడుసార్లు మొబైల్ హాండ్సెట్లను ఉపయోగించారు. అందులో ఒకదానిని రోజువారీ పనుల కోసం ఉపయోగించారు. ఇక మీతో ఫోన్లను కేవలం వాట్సాప్, టెలిగ్రామ్ కోసం ఉపయోగించారు. ఈ ఫోన్లను దర్యాప్తు అధికారులు టెర్రర్ వస్తువులుగా పేర్కొంటున్నారు.
పాకిస్తాన్ నుంచి మాస్టర్ మైండ్స్ పంపించిన కోడ్స్ ను ఫోరెన్సిక్ నిపుణులు డీకోడ్ చేశారు.. వచ్చిన కోడ్స్ లో “ఉకాసా, ఫైజాన్, హస్మి అనే కోడ్ లు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వీటికి బలమైన అర్థం ఉంటుందని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నారు. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తులు ఘోస్ట్ సిమ్ లు ఎలా పొందారో అర్థం కావడం లేదని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. అయితే జమ్ము కాశ్మీర్ పోలీసులు మాత్రం ఘోస్ట్ సిమ్ లకు సంబంధించి కీలక ఆధారాలను సేకరించినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదుల కోసం సిమ్ లు అందజేయడానికి పెద్ద వ్యవస్థ నడిచిందని.. ఈ రాకెట్ మొత్తాన్ని పోలీసులు చేదించడంతో కీలక విషయాలు బయటపడ్డాయి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ కు చెందిన మాడ్యూల్స్ ఉగ్ర డాక్టర్లకు స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.