Shivaji Vs Anvesh: ప్రముఖ నటుడు శివాజీ(Actor Shivaji) తన వ్యాఖ్యలతో చిన్న నిప్పు అంటిస్తే, అది కారుచిచ్చు గా మారి ఎక్కడ దాకా ఈ వ్యవహారం వెళ్ళింది అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఈ అంశం లో శివాజీ జనాల నుండి మద్దతు లభిస్తే , ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లపై తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. అలా వ్యతిరేకతని ఎదురుకుంటున్న వారిలో ముందుగా మనం మాట్లాడుకోవాల్సినదే అన్వేష్(Naa Anveshana) గురించి . ఇతను శివాజీ పై అత్యంత దారుణమైన భాషతో దూషిస్తూ, ఆ తర్వాత హిందీ దేవుళ్ళ పై అణిచిత వ్యాఖ్యలు చేయడంతో, ఇతనిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో నాన్ స్టాప్ గా కేసులు పడుతూనే ఉన్నాయి. అంతే కాకుండా లక్షల సంఖ్యలో ఇతని యూట్యూబ్ ఛానల్ ని అనిసరించే వారు రోజురోజుకు తగ్గిపోతున్నారు. ఇదంతా పక్కన పెడితే శివాజీ అన్వేష్ వీడియోస్ కంటెంట్ కి పెద్ద ఫ్యాన్ అనే విషయం మన అందరికీ తెలిసిందే.
ఈ విషయాన్ని స్వయంగా శివాజీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేముందు చెప్పుకొచ్చాడు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా అదే మాట. ఆయన అన్వేష్ గురించి గొప్పగా మాట్లాడిన ఈ మాటలు చూస్తే, ఇలాంటి మనిషి పై అసలు అలా నోరు జారడం అమానుషం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ తిట్టుకొస్తున్నారు. ఇంతకీ శివాజీ ఏమి మాట్లాడాడో అప్పట్లో ఒకసారి చూద్దాం. ఆయన మాట్లాడుతూ ‘బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచన రోజు నుండి, ఇక్కడి వచ్చే ముందు వరకు కూడా వాడి వీడియోస్ చూస్తూనే ఉన్న. ఆ అబ్బాయి చెప్పే దాంట్లో తీసుకునే ఎంటర్టైన్మెంట్ స్టైల్ నాకు చాలా ఇష్టం. అన్వేష్ ఎలాంటోడో, అన్వేష్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనేది నాకు అనవసరం. అన్వేష్ కంటెంట్ నాకు నచ్చింది. అందుకే గత రెండు సంవత్సరాల నుండి అతని వీడియోస్ చూస్తూనే ఉన్నాను’.
‘నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు వాడు నాకు నాకు సపోర్ట్ చేశాడా లేదా అనేది నాకు అనవసరం. నాకు అతని కంటెంట్ నచ్చింది అంతే. బహుశా అతన్ని నేను కలుస్తానేమో కూడా, నాకు కలవాలని కూడా ఉంది. అన్వేష్ నువ్వు హైదరాబాద్ కి వచ్చినప్పుడు, నీకు అవకాశం ఉంటే ఫోన్ చెయ్యి. నువ్వు ఎక్కడున్నా నేనే వచ్చి కలుస్తాను’ అంటూ గతం లో శివాజీ ఎంతో మర్యాదపూర్వకంగా మాట్లాడుతాడు. అందుకు సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. అతని గురించి అంత గొప్పగా మాట్లాడిన వ్యక్తిని ఇంత నీచమైన భాషతో అన్వేష్ దూషించడం, అత్యంత దుర్మార్గమైన విషయం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.