Pawan Kalyan OG trailer : తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. కాబట్టి వాళ్లు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో పాల్గొని వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరి ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట స్టార్ హీరోల నుంచి వచ్చే సినిమాలు సూపర్ సక్సెస్ సాధిస్తే వాళ్ల మార్కెట్ విపరీతంగా పెరగడమే కాకుండా భారీ క్రేజ్ కూడా సంపాదించుకుంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి దక్కనటువంటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న నటుడు కూడా తనే కావడం విశేషం…అయితే ఈనెల 25వ తేదీన ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆయన ఓజీ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. నిన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు తన అభిమానుల్లో జోష్ నింపాయి.
అంతా బానే ఉన్నప్పటికి ఓజీ సినిమా ట్రైలర్ వస్తుందని చెప్పినప్పటికీ అది ఇప్పటి వరకు రాలేదు. కారణం ఏంటి అంటే టెక్నికల్ గా ఇంకా కొంచెం వర్క్ పూర్తయివ్వాల్సిన పని అయితే ఉందని చెబుతున్నారు… రెండు నిమిషాల ట్రైలర్ కి అంత టెక్నికల్ వర్కు ఉంటే రెండున్నర గంటల సినిమాకి ఇంకెంత టెక్నికల్ వర్క్ ఉండాలి. మరి ఆ వర్క్ నైనా పూర్తి చేశారా? సినిమా అయినా అనుకున్న సమయానికి థియేటర్లోకి వస్తోందా?
లేదా అంటూ నెటిజన్లు సైతం సుజిత్ మీద ఫైర్ అవుతున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ సైతం సుజిత్ మీద కొంతవరకు కోపానికి అయితే వచ్చాడు. ఇంకా టెక్నికల్ వర్క్ పూర్తవ్వకపోవడం ఏంటి ట్రైలర్ అనుకున్న సమయానికి తీసుకురావాలి కదా అభిమానులు ఎంత సేపు అని వెయిట్ చేస్తారు అంటూ ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి… ఇక కొంతమంది ఓజీ సినిమా పట్ల వ్యతిరేకత అయితే చూపిస్తున్నారు.
అన్ని అనుకున్న సమయానికి రిలీజ్ అవ్వనప్పుడు ఎందుకని ముందుగానే డేట్స్ ని అనౌన్స్ చేస్తున్నారు అంటూ మరి కొంతమంది కామెంట్ చేస్తుండటం విశేషం…ఇక అభిమానులను చాలావరకు వెయిట్ చేయించడం కరెక్ట్ కాదని దానివల్ల సినిమా మీద హైప్ తగ్గే అవకాశాలైతే ఉన్నాయని మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ట్రైలర్ ఎప్పుడూ రిలీజ్ అవుతోంది అనేది…