Pawan Kalyan OG Movie : మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆయన ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతను కొనసాగిస్తూనే ఇంతకు ముందు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సినిమాలు కంప్లీట్ అయినప్పటికి సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటూ సినిమా మీద భారీ హైప్ అయితే తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఓజీ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపద్యం లో ఇప్పటికే ఈ సినిమా మీద భారీ హైప్ అయితే ఉంది. మరి ఇంకా పెంచాలని ఉద్దేశ్యంతోనే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేపట్టారు. ఇక ఈ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ చాలా అద్భుతంగా మాట్లాడాడు.
సినిమాకు సంబంధించిన విషయాలను చెబుతూనే ఎలాగైనా సరే ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తోంది అనే నమ్మకం తమకు ఉందని చెప్పాడు. అలాగే సుజిత్ లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి అవసరమని ఆయన దగ్గర మంచి టాలెంట్ ఉందని చెప్పాడు. ఓజీ సినిమా మీద పవన్ కళ్యాణ్ అంతలా ఆశలు పెట్టుకోవడానికి గల కారణం ఏంటి అంటే ఈ సినిమా అవుట్ పుట్ చాలా అద్భుతంగా వచ్చిందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఇక పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల తర్వాత తన పూర్తి స్టామినాను ఈ సినిమాలో చూపించబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక ఇప్పటికే అతని అభిమానులైతే ఈ సినిమా మీద అంచనాలను తార స్థాయిలో పెట్టేసుకున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తోంది. తద్వారా పవన్ కళ్యాణ్ క్రేజ్ పాన్ ఇండియాలో విపరీతంగా పెరిగిపోతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…