Homeటాప్ స్టోరీస్MSME National Conference Hyderabad: బాహుబలి లాంటి ఆర్థిక వ్యవస్థ కోసం.. హైదరాబాదులో జాతీయ సదస్సు.....

MSME National Conference Hyderabad: బాహుబలి లాంటి ఆర్థిక వ్యవస్థ కోసం.. హైదరాబాదులో జాతీయ సదస్సు.. ఇంతకీ ఏం చేయబోతున్నారంటే?

MSME National Conference Hyderabad: ఏ దేశానికైనా సరే ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండాలి. ఆర్థిక వ్యవస్థ బాగుంటేనే ఆ దేశం శక్తివంతంగా ఉంటుంది. దీనిని గుర్తించి దేశ ప్రధాని నరేంద్ర మోడీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.

MSME National Conference Hyderabad
MSME National Conference Hyderabad

ఇటీవల బడ్జెట్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ఈక్విడిటీ, లిక్విడిటీ, వృత్తిపరమైన మద్దతు ఇచ్చేందుకు కేంద్రం మూడు కోణాల విధానాన్ని ప్రతిపాదించింది. ప్రపంచ స్థాయిలో చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి కేంద్రం కొరియర్ ఎగుమతులపై ప్రస్తుత నిల్వపరిమితిని (10 లక్షల ను) పూర్తిగా తొలగించింది. మన దేశ తయారీ రంగంలో ఎగుమతులలో 48.58%, జిడిపిలో 31.1 శాతం, తయారీ రంగంలో 35.4 శాతం వాటా కలిగి ఉంది.

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దేశవ్యాప్తంగా 32.82 కోట్ల మంది వ్యక్తులకు ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ రంగంలో 7.47 కోట్లకు పైగా సంస్థలు ఉన్నాయి.

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దేశ ఆర్థిక రంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వీటిని మరింత బలోపేతం చేయడానికి కేంద్రం కంకణం కట్టుకుంది.

మొదటి విధానంలో ఈక్విటీ మద్దతు అందించనుంది. ద్రవ్యలభ్యతను పెంచుతుంది. వృత్తిపరమైన, నిర్వాహక నైపుణ్యాన్ని అందిస్తుంది. తద్వారా ఈ పరిశ్రమల అభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తుంది.

రెండవ విధానంలో భాగంగా వ్యవస్థాపకతను ప్రోత్సహిస్తుంది. ఉపాధి, జీవనోపాధి అవకాశాలను సృష్టిస్తుంది. పోటీ తత్వాన్ని పెంచుతుంది. అనేక రాష్ట్రాలకు మద్దతు ఇస్తుంది. ఇది మాత్రమే కాదు బడ్జెట్ కేటాయింపులు కూడా పెంచింది. తద్వారా ఈ పరిశ్రమల పనితీరు దీర్ఘకాలికంగా ఉండేలా కేంద్రం చర్యలు తీసుకుంది.

మూడో విధానంలో భాగంగా.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నుంచి సీపీఎస్ ఈ లు కొనుగోలు చేసే అన్నింటికీ సెటిల్మెంట్ ప్లాట్ ఫామ్ గా TReDS ను తప్పనిసరి చేసింది. కార్పొరేట్ కంపెనీల కూడా విధివిధానాలు రూపొందించింది. TReDS ప్లాట్ ఫామ్ లో ఇన్ వాయిస్ డిస్కౌంట్ కోసం CGT MSE మద్దతు ఉండే క్రెడిట్ గ్యారంటీ ని కేంద్రం ఇస్తుంది.

TReDS అనేది బహుళ వ్యాపారుల ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వాణిజ్య రాబడులకు ఫైనాన్స్ డిస్కౌంట్ సులభతరం చేస్తుంది. ఇది పూర్తిగా ఎలక్ట్రానిక్ ప్లాట్ఫారం.

డిజిటల్ మార్కెటింగ్, ఏఐ ఆటోమేషన్, ఈ కామర్స్ పై జాతీయ సదస్సు

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ni-msme) ఆధ్వర్యంలో డిజిటల్ మార్కెటింగ్, ఏఐ ఆటోమేషన్, ఈ కామర్స్ అనే అంశాలపై జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. మార్చి 12, 13 తేదీలలో హైదరాబాదులో ని యూసఫ్ గూడ లో ni- msme క్యాంపస్ లో నిర్వహిస్తారు.

రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో సోషల్ మీడియా ట్రెండ్స్, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నిర్వహించే కంటెంట్ క్రియేషన్, ఆటోమేషన్ వర్క్ ఫ్లో, కస్టమర్ సైకాలజీ, బ్రాండింగ్ ప్యాకేజింగ్, ఈ కామర్స్ కంప్లయిన్స్, GeM, ONDC, TReDS వంటి ప్రభుత్వ డిజిటల్ ప్లాట్ ఫామ్ ల వినియోగంపై నిపుణులు తమ అనుభవంతో పాటు.. లోతైన వివరాలను అందిస్తారు.

ఈ కార్యక్రమంలో స్టార్టప్ లాంచ్, గో టు మార్కెట్ వ్యూహాలు, సమాచారం ఆధారిత నిర్ణయాలు వంటి అంశాలపై ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో MSMEs, స్టార్టప్స్, డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు, ప్రభుత్వ సంస్థలు, టెక్నాలజీ సొల్యూషన్ ప్రొవైడర్లు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొని ప్రసంగిస్తారు.

ఈ సదస్సుకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి చివరి తేదీగా మార్చి 9 ని నిర్ణయించారు. ఫిబ్రవరి 28 లోపు నమోదు చేసుకునే వారికి 1200.. అనంతరం 2000 ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. పరిమిత స్థాయిలో సీట్లు ఉన్న నేపథ్యంలో.. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి మాత్రమే అవకాశం ఉంటుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు.

Please mention this Registration Link: https://www.nimsme.gov.in/surl/he0v

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version