Homeఎంటర్టైన్మెంట్Manchu Lakshmi: సినిమాలు నిర్మించి అప్పుల పాలయ్యాను..అందుకే ఇలాంటి పనులు చేస్తున్నా - మంచు లక్ష్మి

Manchu Lakshmi: సినిమాలు నిర్మించి అప్పుల పాలయ్యాను..అందుకే ఇలాంటి పనులు చేస్తున్నా – మంచు లక్ష్మి

Manchu Lakshmi: మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) కూతురుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మి(Manchu Lakshmi), హీరోయిన్ గా కాకుండా, బలమైన క్యారెక్టర్స్ చేస్తూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని సంపాదించుకుంది. అయితే మధ్యలో ఈమె నిర్మాతగా వ్యవహరించిన సినిమాలన్నీ డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. డబ్బులు మొత్తం పోయాయి. పూర్తిగా అప్పుల పాలు అయ్యింది. అప్పటి నుండి నిర్మాణం జోలికి పోకుండా కేవలం నటనకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ కెరీర్ ని ముందుకు సాగిస్తోంది. రీసెంట్ గా ఈమె తమిళం లో ‘బూకి’ అనే చిత్రం చేసింది. త్వరలో ఈ సినిమా విడుదల కాబోతుండగా, మేకర్స్ ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్న లక్ష్మి ప్రసన్న, చేసిన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

ఆమె మాట్లాడుతూ ‘సినిమాలను నిర్మించే స్థాయిలో ఇప్పుడు నేను లేను. నిర్మాతగా చాలా డబ్బులు పోగొట్టుకున్నాను. ఇప్పుడు ఆ అప్పులను తీర్చేందుకే నటిస్తున్నాను. దేవుడి దయ వల్ల కోలీవుడ్ లో ఈమధ్య వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. వాళ్ళు ఇచ్చే చెక్కులతోనే నా అప్పులను కట్టుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది లక్ష్మి ప్రసన్న. ఆమె మాట్లాడిన ఈ మాటలను చూసి, అంత పెద్ద మోహన్ బాబు కూతురికి కూడా ఇన్ని కష్టాలా?, నోరు తెరిచి సహాయం చెయ్యమని అడిగితే మోహన్ బాబు డబ్బులు ఇస్తాడు కదా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ స్వతంత్రం గా తన కాళ్ళ మీద తానూ నిలబడాలి అనుకునే వాళ్ళు ఇలాగే ఉంటారని, ఈ విషయం లో మంచు లక్ష్మి ని మెచ్చుకోవలసిందే అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా నిన్నటి ప్రెస్ మీట్ లో ఈమె భార్యభర్తల సంబంధం గురించి మాట్లాడిన మాటలు కూడా వైరల్ అయ్యాయి.

ఆమె మాట్లాడుతూ ‘నన్ను కొట్టినా, చంపినా పర్వాలేదు, నేను ఆయనతోనే ఉంటాను అని కొందరు అంటుంటారు, కానీ కొంతమంది స్త్రీలు మాత్రం మౌనంగా ఉండరు, ఒక దెబ్బ కొడితే, తిరిగి చెప్పుతో కొట్టే స్త్రీలు కూడా ఉన్నారు, ఆ నేపథ్యం లో తెరకెక్కిన ‘ధపడ్’ లాంటి చిత్రాలకే నేను ప్రాధాన్యత ఇస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఇదంతా పక్కన పెడితే ఆమె ప్రధాన పాత్ర పోషించిన ఈ బూకి చిత్రంలో విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ ధీషన్ , ధనూషా జంటగా నటించారు. గణేష్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, విజయ్ ఆంటోనీ సహా నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా , ఎడిటర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా ఈ చిత్రానికి పని చేయడం విశేషం. ఈ నెల 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version