Bandi Sanjay Comments On Kavitha: కాళేశ్వరం ఇష్యూని డైవర్ట్ చేయడానికే కవిత ఇష్యూని తెర మీదకు తెచ్చారని కేంద్రమంత్రి బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బీజేపీ మరో ఎంపీ డీకే అరుణ కూడా ఇదే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాంగ్రెస్ వాళ్లతో కుమ్మక్కై బీఆర్ఎస్ వాళ్లు ఈ డ్రామాలు చేస్తున్నారని ఆరోపించరు. కవిత సస్పెండ్ కాలేదు.. ఇదంతా డ్రామా అంటూ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ ప్రకారం కవితపై వచ్చిన ఆరోపణలు, ఆమె వ్యవహారాలు కాళేశ్వరం ప్రాజెక్టులోని అవినీతిని ప్రజల దృష్టి నుంచి మళ్లించడానికి జరుగుతున్న డ్రామా అని బీజేపీ నేతలు ఘంటాపథంగా చెబుతున్నారు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై ఈ నాటకాలు ఆడుతున్నాయని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవినీతికి కల్వకుంట్ల కుటుంబం మొత్తం బాధ్యులని బండి సంజయ్ స్పష్టంగా చెప్పారు. ఈ ఆరోపణల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ఆయన చెప్పకనే చెప్పారు.
Also Read: కవితకు కేఏ పాల్ ఆహ్వానం.. ఇదే మరి కామెడీ అంటే..
– కవిత రాజీనామా, సస్పెన్షన్ డ్రామా
కవితను పదవి నుంచి తొలగించడం, ఆమె రాజీనామా చేయడం కేవలం ఒక డ్రామా అని బండి సంజయ్ అన్నారు. ప్రజలకు ఇదంతా ఒక నాటకంలా కనిపిస్తోందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయని ఆయన సూచించారు. “దొందు దొందే” అన్న సామెతను వాడి, ఈ రెండు పార్టీల తీరు ఒకే విధంగా ఉందని ఎత్తి చూపారు.
కాళేశ్వరం ఇష్యూని డైవర్ట్ చేయడానికే కవిత ఇష్యూని తెర మీదకు తెచ్చారు : బండి సంజయ్
టీవీ వాళ్లకు దండం పెడతా కవిత, బీఆర్ఎస్ లపై ఇకనైనా బ్రేకింగ్‌లు ఆపేయండి.
ఆమె రాజీనామా చేస్తే ఏంది? చేయకపోతే ఏంది? వాళ్ల వల్ల తెలంగాణ ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా?
కాంగ్రెస్ వాళ్లతో కుమ్మక్కై… pic.twitter.com/z1dis3Uegh— ChotaNews App (@ChotaNewsApp) September 3, 2025
– కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు
కేసీఆర్ లేకపోతే కవిత ఎవరు? అని ప్రశ్నిస్తూ కేసీఆర్ ప్రాపకం వల్లనే కవితకు రాజకీయంగా గుర్తింపు వచ్చిందని బండి సంజయ్ అన్నారు. హరీష్ రావు, సంతోష్ రావు వంటి నాయకులు కేసీఆర్ అనుమతి లేకుండా ఏమీ చేయరని, కవిత వ్యవహారాలలో వారి ప్రమేయం కూడా కేసీఆర్‌కు తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. ఇది పరోక్షంగా కేసీఆర్‌కు కూడా ఈ కేసులతో సంబంధం ఉందని ఆరోపిస్తుంది.
– మీడియా పాత్రపై విమర్శ
టీవీ ఛానెళ్లు, మీడియా సంస్థలు బీఆర్ఎస్, కవిత అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టడం మానేయాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. బ్రేకింగ్ న్యూస్‌ల కంటే ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఇది రాజకీయ నాయకులు తరచుగా చేసే విమర్శ. ఎందుకంటే మీడియా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నది వారికి ఇష్టం లేని అంశాలపై అని భావించినప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు.
బిగ్ టీవీతో బీజేపీ ఎంపీ డీకే అరుణ..
కవిత సస్పెండ్ కాలేదు.. ఇదంతా డ్రామా
కేసీఆర్ లేకపోతే కవిత ఎవరు..?
కేసీఆర్ కు తెలియకుండానే కవిత చెబుతున్న హరీష్ రావు, సంతోష్ రావులు పని చేశారా..?
కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవితే స్పష్టంగా చెబుతోంది
కాళేశ్వరం అవినీతిలో కల్వకుంట్ల… pic.twitter.com/fPn8lohWJ8
— BIG TV Breaking News (@bigtvtelugu) September 3, 2025
ఈ వ్యాఖ్యలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ వ్యూహంలో భాగమే. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా కేసీఆర్ కుటుంబాన్ని నిరంతరం విమర్శించడం, వారి అవినీతిని ప్రజలకు తెలియజేయడం బీజేపీ లక్ష్యం. కాళేశ్వరం, కవిత కేసులను కలిపి చూడటం ద్వారా, రెండు అంశాలలో అవినీతికి కారణం ఒకటే అని చెప్పడానికి బండి సంజయ్ ప్రయత్నించారు. ఈ వ్యాఖ్యలు వెనుక ప్రధానంగా రాజకీయ లక్ష్యాలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి ఇప్పుడు అందరి టార్గెట్ గా కేసీఆర్ ఫ్యామిలీ మారింది.