Coolie Collection Day 20: తమిళనాడు రాష్ట్రం అంటే ఒకప్పుడు మనకు సూపర్ స్టార్ రజినీకాంత్(Super Star Rajinikanth) మాత్రమే గుర్తుకు వచ్చేవాడు. తమిళ ప్రేక్షకుల్లో ఆయన వేసుకున్న ముద్ర అలాంటిది. నాలుగు దశాబ్దాలు తిరుగే లేకుండా నెంబర్ 1 స్థానం లో కొనసాగిన సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ ‘కబాలి’ తర్వాత భారీగా పడిపోయింది అనడం లో ఎలాంటి సందేహం లేదు. డిజాస్టర్ టాక్ తో ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ ని అందుకునే రేంజ్ లో ఉన్న సూపర్ స్టార్, ఇప్పుడు కనీసం ‘కూలీ'(Coolie Movie) లాంటి యావరేజ్ సినిమాలను కూడా తమిళనాడు లో హిట్ చేయలేకపోతున్నాడు. ఈ అసంతృప్తి పాపం రజినీకాంత్ లో కూడా ఉంది. ఒకప్పుడు తమిళనాడు లో నాన్ రజినీకాంత్ రికార్డ్స్ ఉండేవి. అంటే ఆయన రికార్డ్స్ ని ఎవ్వరూ అందుకోలేరు కాబట్టి, ఆయన సినిమా రికార్డు తర్వాత వచ్చిన రికార్డు ని నాన్ రజిని రికార్డు గా పరిగణించేవారు ట్రేడ్ పండితులు.
Also Read: కవితతో ‘కాళేశ్వరం’ను డైవర్ట్ చేశారా?
కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. విజయ్, అజిత్ లాంటి స్టార్ హీరోల ముందు రజినీకాంత్ తేలిపోతున్నాడు. వాళ్ళ సంగతి పక్కన పెడితే, ప్రస్తుతం ఆయన శివ కార్తికేయన్ లాంటి యంగ్ హీరోలను కూడా తమిళనాడు లో అందుకోలేకపోతున్నాడు. ఉదాహరణకు రీసెంట్ గా విడుదలైన ‘కూలీ’ చిత్రం తమిళనాడు లో 20 రోజులకు కలిపి 148 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 240 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావాలి. అది అసాధ్యం, మహా అయితే ఇంకో 5 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వస్తాయి ఈ చిత్రానికి. అయితే శివకార్తికేయన్ హీరో గా నటించిన ‘అమరన్’ చిత్రం తమిళనాడు లో 170 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కూలీ 155 కోట్ల వద్ద క్లోజింగ్ లో సర్దేయొచ్చు.
రజినీకాంత్ గత చిత్రం ‘వెట్టియాన్’ కూడా తమిళనాడు లో శివకార్తికేయన్ ‘అమరన్’ చిత్రాన్ని డాలేకపోయింది. ఇలాంటి పరిస్థితి రజినీకాంత్ కి వస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో 69 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా , కర్ణాటక ప్రాంతం లో 45 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా ఓవర్సీస్ లో అక్షరాలా 178 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టిన ఈ చిత్రం, కేరళ లో పాతిక కోట్లు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా లో 48 కోట్లు రాబట్టింది. ఓవరాల్ గా 20 రోజుల్లో ఈ చిత్రానికి 513 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. మార్కెట్ టర్మ్స్ ప్రకారం 84 శాతం బ్రేక్ ఈవెన్ ఈవెన్ మార్కుని అందుకుంది.