Chiranjeevi : మధ్య తరగతి కుటుంబం నుండి ఒక వ్యక్తి ఇండస్ట్రీ లోకి వచ్చి పైకి ఎదిగిన తర్వాత లగ్జరీ మత్తులో మూలలను మర్చిపోతూ ఉంటారు కొంతమంది. కానీ ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండే ఉన్నతమైన మనుషులు కూడా ఉంటారని మనకు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ని చూసిన ప్రతీసారి అనిపిస్తూ ఉంటుంది. ఆయన స్థాయికి ఒదిగి ఉండాల్సిన అవసరం అసలు లేదు, కానీ మూలాలు అమ్మలాంటిది అని నమ్మే ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి మన మెగాస్టార్. అందుకే ఆయన్ని అభిమానులు అంతలా అభిమానిస్తూ ఉంటారు. తనకు పుట్టుక వచ్చిన ఆ లక్షణాలను తన తమ్ముళ్లకు, బిడ్డలకు నేర్పించారు. ఆయన నేర్పించిన లక్షణాలతో పెరిగిన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నేడు డిప్యూటీ సీఎం స్థాయిలో ఎలాంటి సేవలను అందిస్తున్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇకపోతే సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన మెగాస్టార్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది.
ఈ వీడియో లో ఒక వీరాభిమాని నడవలేని స్థితిలో ఉన్న తన తల్లిని వీల్ చైర్ మీద కూర్చోబెట్టి చిరంజీవి వద్దకు తీసుకొచ్చాడు. చిరంజీవి వీళ్ళను నిండు మనసుతో స్వాగతించి, బాగోగులు అడిగి తెలుసుకున్నారు. కుటుంబం మొత్తానికి ఓపిగ్గా సెల్ఫీలు ఇచ్చాడు. ఆ అభిమాని మెగాస్టార్ ని చూసిన ఆనందం తో ఆయన కాళ్ళ మీద చాలా సేపటి వరకు పడి ఆశీర్వాదం అందుకున్నాడు. అనంతరం వీల్ చైర్ లో కూర్చున్న తల్లిని కూడా పలకరించాడు. పాపం ఆమె చేతులు పని చేయడం లేదు,కాళ్ళు కూడా పనిచేయడం లేదు,కనీసం మాటలు కూడా వచ్చినట్టుగా లేదు. అలాంటి ఆమె చిరంజీవి మీద అభిమానంతో తన కొడుకు సాయంతో ఇంత దూరం వచ్చింది. ఆ అభిమాని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది. తనని అన్నయ్యతో కలిపించేలా చేసిన అభిమానులకు ధన్యవాదములు అంటూ చెప్పుకొచ్చాడు.
ఒక సాధారణ అభిమాని కోసం ఇంత సమయం వెచ్చించాల్సిన అవసరం చిరంజీవి కి లేదు. కానీ అభిమానుల వల్లనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అనే సత్యం తెలిసిన వ్యక్తి కాబట్టి ఇలా ఉన్నాడు. చాలా మంది హీరోలు ఒకటి రెండు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తగిలిన వెంటనే తాము ఆకాశం నుండి ఊడిపడిన ధృవ తారలుగా ఊహించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు చిరంజీవి నుండి చూసి నేర్చుకోవలసినవి చాలానే ఉన్నాయి. ఇక చిరంజీవి ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే ‘విశ్వంభర’ చిత్రం దాదాపుగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. మరో పక్క అనిల్ రావిపూడి తో చేస్తున్న సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో ముందుకు దూసుకుపోతుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.