Kukatpally Sahasra Case: వాడు చదువుతోంది పదవ తరగతి.. పుస్తకాలతో కుస్తీ పడుతూ.. మార్కులు ఎలా సాధించాలి అనే ఆలోచనలో ఉంటూ.. గొప్ప ర్యాంకు సాధించాలని తలంపు ఉండాల్సిన వయసులో దారి తప్పాడు. కన్నవాళ్ళు పట్టించుకోకపోవడం..స్మార్ట్ ఫోన్ లో నేరమయ కథ చిత్రాలను చూడడంతో ఇష్టానుసారంగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. అంతేకాదు క్రికెటర్ కావాలని కలలు కనడం మొదలుపెట్టాడు. ఇదే విషయాన్ని ఇంట్లో తల్లిదండ్రులతో చెబితే వారు ఒప్పుకోలేదు. పైగా క్రికెటర్ కావాలంటే ఖరీదైన బ్యాట్ ఉండాలి. దానిని ఎలా సమకూర్చుకోవాలో అతనికి అర్థం కాలేదు.. ఇటీవల సహస్ర పుట్టినరోజు వేడుకలు జరగడం.. ఆ సమయంలో వారింట్లో డబ్బుకు సంబంధించిన చర్చ జరగడం.. వారి బీరువాలో ₹80,000 నగదును కుటుంబ సభ్యులు పెడుతుంటే చూడడంతో.. ఆ బాలుడి మదిలో చెడు ఆలోచన మెదిలింది.
Also Read: కూకట్ పల్లి బాలిక హత్య కేసు.. వీడు మామూలోడు కాదు.. పోలీసులకే దిమ్మతిరిగిపోయింది
వాస్తవానికి సహస్ర ఇంట్లో దొంగతనాన్ని కంటే ముందు గుడిలో చోరీ చేయాలని ఆ బాలుడు అనుకున్నాడు. దానికి తగ్గట్టుగానే ఒక పదునైన కత్తిని తన వెంట ఉంచుకున్నాడు.. ఈ ప్లాన్ ను రూపొందించే క్రమంలో తన నోట్ పుస్తకంలో ఈ వ్యవహారం మొత్తాన్ని రాసుకున్నాడు. ఎలా నేరం చేయాలి.. ఎలా డబ్బు దొంగిలించాలి.. ఎవరైనా ఎదురొస్తే ఏం చేయాలి.. అనే కోణాలలో ఇంగ్లీషులో రాసుకున్నాడు. చివరికి దీనికి mission డాన్ అని ముగింపు ఇచ్చాడు.. తన నోటు పుస్తకంలో ఏదైతే రాసుకున్నాడో దానిని యధావిధిగా అమలు చేశాడు ఆ బాలుడు.
సహస్ర ఇంట్లో ఎవరూ లేరని.. కేవలం ఆ బాలిక మాత్రమే ఉందని తెలుసుకున్న తర్వాత పక్క సందులో ఉండే వారి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. బిల్డింగులు మారుతూ సహస్ర కుటుంబం ఉండే ఇంట్లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత నేరుగా బీరువా దగ్గరికి వెళ్లి డబ్బు తీసుకున్నాడు. దానిని సహస్ర చూడడంతో.. కత్తితో గొంతు కోశాడు. రక్తపు మడుగులో కొట్టుకుంటున్న సహస్రను చూసి.. ఆమె ఒకవేళ బతికి తన పేరు చెబితే ఇబ్బంది అని భావించి.. ఏ మాత్రం కనికరం లేకుండా కత్తితో విపరీతంగా పొడిచాడు.. ఆ తర్వాత వచ్చినదారి వెంట వెళ్లిపోయాడు. అయితే సిసి కెమెరాలలో చిక్కకుండా అత్యంత జాగ్రత్తగా ఆ బాలుడు వెళ్లిపోయాడు. సహస్ర ఇంట్లో నుంచి అతడు వెళ్ళిపోతున్న దృశ్యాలను ఓ ఐటీ ఉద్యోగి చూశాడు. అతడు పోలీసులకు ఈ విషయాన్ని చెప్పడంతో ఈ కేసులో పురోగతి లభించింది.
పిల్లల్లో విపరీతమైన స్వేచ్ఛ.. పెద్దవాళ్లు పట్టించుకోకపోవడం.. కట్టుబట్లు ఏమాత్రం లేకపోవడంతో ఆ బాలుడు దారుణంగా వ్యవహరించాడు. ఏకంగా బాలికను దారుణంగా హతమార్చాడు. ఇంత దారుణానికి పాల్పడినప్పటికీ.. ఇంత ఘోరానికి. ఒడి గట్టినప్పటికీ అతడి ముఖంలో ఏమాత్రం తప్పు చేశాననే భావన కనిపించలేదు. పైగా ఏదో సాధించాను అన్నట్టుగా అతడు తన హావభావాన్ని ప్రదర్శించాడు. అన్నింటికీ మించి స్కూలుకు వెళ్లి పోలీసులు విచారణ సాగిస్తున్నప్పుడు ఆ బాలుడు ఏమాత్రం తప్పు చేశానని ఒప్పుకోకపోవడం విశేషం. ఇదే క్రమంలో పోలీసులు ఆ బాలుడి ఇంట్లో తనిఖీలు నిర్వహించగా.. రక్తపు మరకలు ఉన్న దుస్తులు, పదునైన ఆయుధం, ఈ దారుణానికి పాల్పడేందుకు అతడు రాసుకున్న స్క్రిప్ట్ కనిపించాయి.