Peddapalli Child Trapped Car: నేటి కాలంలో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా ఉంది. సోషల్ మీడియా వల్ల అనేక రకాల ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయని.. అనారోగ్య సమస్యలు చవి చూడాల్సి వస్తుందని వైద్యులు, మానసిక నిపుణులు హెచ్చరిస్తుంటారు. కానీ సోషల్ మీడియా వల్ల ఒక చిన్నారి ప్రాణం నిలబడింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది.
Also Read: ఏఎస్పీ తో ఐ లవ్యూ.. ఆస్పత్రిలో ఖైదీతో హాట్ రొమాన్స్.. సంచలనం సృష్టిస్తున్న కిలేడి వీడియోలు!
తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ప్రమాదంలో ఉన్న ఒక చిన్నారిని సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో రక్షించారు.. కుటుంబ సభ్యులు చిన్నారిని కారులో విడిచిపెట్టి బయటికి వెళ్లిపోయారు. అంతేకాదు కారు తాళం చెవి అందులోనే మరిచిపోయారు.. ఈ నేపథ్యంలో డోర్లు లాక్ అయ్యాయి. అరగంట తర్వాత దీనిని గమనించిన స్థానికంగా ఉన్న యువకులు.. కారులో ఉన్న చిన్నారికి యూట్యూబ్ వీడియోలు చూపిస్తూ డోర్ అన్లాక్ చేయించారు.. దీంతో కారు డోరు తెరుచుకోవడంతో పాప బయటికి వచ్చింది.
కారు డోర్లు లాక్ అయితే శ్వాస తీసుకునే అవకాశం ఉండదు. ఊపిరి ఆడక చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి ఉపద్రవమే ఆ చిన్నారికి ఎదురయ్యే ప్రమాదం ఏర్పడింది. అయితే స్థానికంగా ఉన్న యువకులు ఆ చిన్నారి పరిస్థితిని చూసి చలించి పోయారు. కారు అద్దంలో నుంచి యూట్యూబ్ వీడియో చూపిస్తూ.. కారు డోర్లు ఎలా అన్లాక్ చేయాలో ఆమెకు అర్థమయ్యేలాగా వివరించారు. ఆ వీడియోలో మాదిరిగా ఆ చిన్నారి కూడా అత్యంత తెలివిగా కారు డోర్లు అన్లాక్ చేసింది. దీంతో డోర్లు తెరుచుకున్నాయి. ఫలితంగా చిన్నారి ప్రాణాలతో బయటపడింది.
గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చిన్నారులు కన్నుమూశారు. ఎందుకంటే కారు డోర్లు ఆటోమేటిక్ గా మూసుకున్నప్పుడు.. బయటినుంచి గాలి రాదు. అప్పుడు ఊపిరి ఆడే అవకాశం ఉండదు. పైగా చిన్నారులకు కారు అద్దాలు బద్దలు కొట్టే సామర్థ్యం ఉండదు. అదే సమయంలో పెద్దలు కూడా దూరంగా ఉంటారు. అందువల్ల ప్రాణ నష్టం చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గతంలో ఈ తరహా సంఘటనలో చాలామంది చిన్నారులు చనిపోయారు. కానీ సుల్తానాబాద్ లో ఆ చిన్నారి మృత్యుంజయురాలుగా నిలిచింది. అయితే చిన్నారిని కారులో వదిలిపెట్టి బయటికి వెళ్లిన పెద్దలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారిని అలా ఒంటరిగా కారులో వదిలిపెట్టకుండా.. తీసుకెళ్తే ఏమైందంటూ మండిపడుతున్నారు.
#Telangana—#Youth rescues #child locked in car with mobile phone guidance in Sultanabad
A child was accidentally locked inside a car after the family left the keys inside in #Sultanabad (#Peddapalli).
A quick-thinking youngster used his mobile phone to guide the family on… pic.twitter.com/FFH8Fr6bWq
— NewsMeter (@NewsMeter_In) August 17, 2025