Tollywood Actors: హీరోగా టాలీవుడ్ లో రానించాలంటే మంచి యాక్టింగ్, స్టైల్ ఉండాలి.. అలానే విలన్ గా రాణించాలి అంటే మంచి బాడీ, విలనిజం పండించగల ఎక్స్ప్రెషన్స్ ఉండాలి. చాలా కొంతమందిలోనే ఇవన్నీ కలిసి ఉంటాయి. అలా ఉన్నవారు మాత్రమే హీరోగాని విలన్ గానే రెండింటిలో మెప్పించగలుగుతారు. మరి అలా హీరో గానే విధంగానే రెండింటిలో మెప్పించిన మన టాలీవుడ్ నటులు ఎవరో చూద్దాం.
రానా
టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న నటుల్లో హీరోగా చేస్తూ విలన్ గా కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్న నటుడు రానా. బాహుబలి సినిమాతో రానా పాన్ ఇండియాలో లెవెల్ లో తన విలన్ కార్యకర్ కి పేరు పొందారు. అంతేకాదు ఆ తర్వాత విడుదలైన భీమ్లా నాయక్ సినిమాలో కూడా కొంచెం నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ చేశారు రానా. ఇక తను హీరోగా నటించిన నేనే రాజు నేనే మంత్రి లో కూడా కొంచెం విలన్ టైపులోనే కనిపిస్తారు ఈ హీరో. ఒక రకంగా చెప్పాలి అంటే రానా తనలో ఉన్న హీరో కన్నా నటుడిని ఎక్కువ సంతృప్తి పరుస్తాడు. అందుకే బాహుబలి లాంటి సినిమాలో తనదైన నటనా కౌశలంతో ఒక రేంజ్ ఆవేశం సృష్టించాడు రానా.
గోపీచంద్
ప్రస్తుతం ఉన్న హీరోల్లో రానా తర్వాత హీరో అండ్ విలన్ క్యారెక్టర్స్ తో, రెండిటిలోనూ మనల్ని మెప్పించిన నటుడు అంటే మనకి గుర్తు వచ్చేది గోపీచంద్ పేరు. తొలివలపు సినిమా ఆటో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ఈ హీరో గుర్తింపు పొందింది మాత్రం తను విలన్ గా నటించినా జయం సినిమాతోనే. ఈ చిత్రంలో గోపీచంద్ యాక్టింగ్ అద్భుతంగా ఉంటుంది. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరో నితిన్ కంటే కూడా గోపీచంద్ హైలెట్ అయ్యారు అనే చెప్పాలి.
ఆ తర్వాత కూడా నిజం వర్షం లాంటి సినిమాల్లో విలన్ క్యారెక్టర్ చేసి తన నటనతో ప్రేక్షకులను సైతం భయపెట్టడు గోపీచంద్. అంతేకాదు తన సినిమా అయినటువంటి గౌతమ్ నందలో కూడా గోపీచంద్ కి హీరోయిజం కన్నా తన విలనిజానికే ఎక్కువ మార్కులు పడ్డాయి.
ఆది పినిశెట్టి
తేజా దర్శకత్వంలో వచ్చిన ఒక విచిత్రం సినిమాతో పరిచయమైన హీరో ఆది పినిశెట్టి. ఆ తరువాత వైశాలి వంటి సూపర్ హిట్ సినిమాతో తెలుగులో తమిళంలో మంచి గుర్తింపు పొందారు ఈ హీరో. కానీ తెలుగు ప్రేక్షకులకు ఆది పినిశెట్టి మరింత దగ్గర అయింది మాత్రం అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమాలోని విలన్ క్యారెక్టర్ తోనే అని చెప్పొచ్చు. ఆ తర్వాత అజ్ఞాతవాసి సినిమాలో కూడా నెగిటివ్ రోల్ చేశారు ఈ హీరో. ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయిన రామ్ “ది వారియర్” సినిమాలో గురు పాత్రతో అదరగొట్టారు ఆది. ఒకపక్క నిన్ను కోరి చిత్రంలో లాంటి సాఫ్ట్ క్యారెక్టర్ చేస్తూనే మరో పక్క ‘ది వారియర్’ లో గురు లాంటి పాత్రలు చేస్తూ, తను ఏ పాత్ర అయినా సులభంగా చేస్తానని రుజువు చేసుకున్నాడు ఆది.
విజయ్ సేతుపతి
96 వంటి తమిళ బ్లాక్ బస్టర్ సినిమాలో హీరో గా నటించిన విజయ్ సేతుపతి, తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యింది మాత్రం ఉప్పెన సినిమాలోని విలన్ క్యారెక్టర్ తోనే. ఆ తరువాత విజయ్ మాస్టర్ ఇక కమల్ హాసన్ విక్రమ్ సినిమాల్లో కూడా విలన్ క్యారెక్టర్ చేసి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు ఈ నటుడు. నాయకుడు, ప్రతినాయకుడు అనే తేడాని యాక్టింగ్ లో పర్ఫెక్ట్ గా ప్రెసెంట్ చేస్తాడు విజయ్ సేతుపతి.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Tollywood actors who have impressed both as hero and villain
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com