Svalbard: ప్రపంచంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. కొత్త ప్రదేశానికి వెళ్లి ఆహ్లాదంగా ఉండాలని ఎవరికైనా ఉంటుంది. అయితే ఖర్చుతోపాటు వీసా సమస్యల వల్ల చూడాలనుకున్న ప్రదేశాన్ని చాలా మంది చూడలేకపోతుంటారు. కానీ వీసా లేకుండానే ఓ అందమైన ప్రదేశాన్ని సందర్శించవచ్చు. అంతేకాకుండా ఇక్కడే సెటిలైపోవచ్చు. విదేశాల్లోకి వెళ్లి సెటిల్ కావాలనే ఉత్సాహం ఉన్నవారికి ఈ ప్రదేశం అనువైనదని చెబుతున్నారు. 76 రోజుల పాటు మొత్తం పగలు.. మిగతా రోజుల్లో పూర్తిగా చీకటి ఉండే భూమిపై గల అరుదైన ప్రాంతమిదీ.. ఇలాంటి వింతైన నగరం నార్వే దేశంలో ఉంది. దాని పేరు ‘లాంగ్ ఇయర్ బైన్’. నార్వే దేశానికి ఉత్తరాన ఉన్న ఈ ద్వీప నగరానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంతకీ ఈ ప్రదేశం ఎక్కడుంది..? దాని విశేషాలేంటి..?
అర్కిటిక్ మహా సముద్రం మధ్యలో ఉంటుంది నార్వే దేశం. ఈ దేశానికి ఉత్తర భాగాన సముద్రంలో 800 కిలోమీటర్ల దూరంలో ‘స్వాల్ బార్డ్’ అనే ప్రదేశం ఉంటుంది. ఇది అత్యంత సుందరమైన ప్రదేశం. స్వాల్ బార్డ్ రాష్ట్ర రాజధానియే లాంగ్ ఇయర్ బైన్. ఇక్కడ దాదాపు 2,400 మంది ప్రజలు నివవిస్తున్నారు. వీరిలో దాదాపు 50 దేశాల నుంచి వచ్చిన వలసవాదులే ఉన్నారు. వీసా అనేది ఇక్కడి ప్రాంతానికి లేదు. ప్రపంచంలోని ఎవరైనా సరే వచ్చి ఇక్కడ నివసించవచ్చు. వీసా ప్రామాణికం లేకపోవడంతో ఇలా విదేశాల నుంచి ఇక్కడికి వలస వచ్చారు. ఇక్కడున్న జనాభాలో మూడింట ఒకవంతు వసలవాదులే కావడం గమనార్హం. ఎక్కువ శాతం ఉద్యోగార్థులే ఇక్కడ నివసిస్తారు. లాంగ్ ఇయర్ బైన్ లో ఓ విశ్వవిద్యాలయం, చర్చి కట్టడాలు ఆకట్టుకుంటాయి.
Also Read: Pawan Kalyan- Akira Nandan: షాకింగ్ : అకీరాతో నాకు సంబంధం లేదని పవన్ నిజంగానే అన్నారా ?
ఉత్తర ధృవానికి దగ్గరగా ఉండడంతో స్వాల్ బార్డ్ లో సంవత్సరం పొడవునా అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వేసవిలో గరిష్టంగా 7 సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇక్కడ మొత్తంగా 40 కిలోమీటర్ల వరకు మాత్రమే రోడ్లు కనిపిస్తాయి. శీతాకాలంలో స్నో మొబైల్ వాహనం ద్వారా ప్రయాణించాల్సిందే. స్వాల్ బార్డ్ లో ధ్రువపు ఎలుగు బంట్లు ఉక్కువగా సంచరిస్తుంటాయి. వాటి దాడిని తట్టుకునేందుకు ప్రజలు తుపాకులను తీసుకెళ్తారు. ఈ ద్వీపం మొత్తంలో 3000 ఎలుగుబంట్లు ఉన్నట్లు అంచనా వేశారు. అంటే ఇక్కడుండే జనాభా కంటే అవి ఎక్కువ.
ఈ ప్రాంతంలో మరో విచిత్రం చోటు చేసుకుంది. ఎవరైనా జన్మించడానికి, మరణించడానికి అనువైన ప్రదేశం కాదంటారు. గర్భిణులను ఎక్కువగా నార్వేకు తీసుకెళ్తారు. ఇక మరణించిన వారిని సైతం విమానంలో ఇతర ప్రదేశాలకు తీసుకెళ్లి పూడ్చిపెడతారు. ఎందుకంటే ఇక్కడ భూమి అంత సంవత్సరం పొడువున భారీ మంచుతో కప్పబడి ఉంటుంది. ఇక్కడ మృతదేహాన్ని పూడ్చిపెట్టడం వల్ల అది త్వరగా కుళ్లిపోదు. దీంతో ఆ మృతదేహం ద్వారా ఇతరులరు వ్యాధులు సంక్రమిస్తాయని అలా చేస్తారు. 1917లో ఇన్ఫ్లు ఎంజా అనే వ్యాధితో బాధపడిన వ్యక్తి మరణించాడు. అతనిని ఇక్కడ పూడ్చిపెట్టారు. అతని శరీరంలో ఇప్పటికీ ఇన్ఫ్లు ఎంజా అనే వైరస్ ఉంది. ఈ కారణంగా మృతదేహాలను ఇక్కడ పూడ్చిపెట్టనివ్వడం లేదు.
12వ శతాబ్ధంలో మొదటిసారి ఈ ద్వీపాన్ని కనుగొన్నట్లు చెబుతున్నారు. 1596లో చైనాకు ఈశాన్య మార్గాన్ని కొనుగొనే ప్రయత్నంలో డచ్ కు చెందిన వారు ఇక్కడికి వచ్చారు. ఆ తరువాత ఇంగ్లండ్, డెన్మార్క్ నుంచి వచ్చారు. 1906లో అలాగే ఫ్రాన్స్, నార్వే, స్వీడన్, వాసులు ఇక్కడ మొదటి బొగ్గుగనిని కనుగొన్నారు. 20 శతాబ్దం వరకు ఇక్కడ చాలా పరిశ్రమలు వెలిశాయి. అలాగే ఇప్పుడు స్వాల్ బార్డ్ ఇప్పుడు ప్రపంచ పర్యాటక ప్రదేశంగా పేర్కొనబడుతుంది. ఇక అసలు విషయం ఏంటంటే ఇక్కడ.. ఏప్రిల్ 10 నుంచి ఆగస్టు 23 వరకు సూర్యుడు అస్తమించడు. మిగతా కాలంలో తీవ్రమైన చలి ఉంటుంది. మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది కాబట్టే ఈ ప్రాంతంలో నివసించడం అత్యంత కష్టం. అందుకే వీసా లేకుండా ప్రపంచంలోని ఎవరైనా సరే ఈ ద్వీపనగరంలో నివాసం ఉండడానికి నార్వే దేశం అనుమతించింది. ఇలా ఎన్నో వింతలు, విశేషాలు, వీసా అవసరం లేని ప్రదేశం ఇది. పర్యాటకులు వెళ్లి చూసి వెళుతుంటారు.
గూగుల్ మ్యాప్ లో స్వాల్ బోర్డ్ ప్రదేశం కింద చూడొచ్చు..
Also Read:Prabhas Viral Photo: వైరల్ గా మారుతున్న 17 ఏళ్ల క్రితం ప్రభాస్ ఫొటో
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: This visa free svalbard archipelago in norway is the northernmost year round settlement in the world
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com