World’s First Prison: జైలు.. నేరం చేసిన వారిని బంధించే గది. కరుడుగట్టిన నేరాగాళ్లకు శిక్ష అమలు చేసేదే కారాగారం. చిన్న చిన్న నేరాలు చేసిన వాళ్ల నుంచి హత్యలు, అత్యాచారాలు, దొమ్మీలు, దొంగతనాలు, ఉగ్రవాదులు ఇలా అన్నిరకాల నేరాలు చేసినవారితోపాటు వైట్ కాలర్ క్రిమినల్స్ కూడా ఉండేది ఇక్కడే. న్యాయస్థానాలు విధించిన శిక్ష అమలు చేసేది ఇక్కడే. ఖైదీలు ఇక్కడ ఊరే ఉండరు. వారికి కూడా ఉపాధి కల్పిస్తారు. వివిధ పనుల్లో భాగస్వాములను చేస్తారు. చదువుకునే అవకాశం కూడా కల్పిస్తారు. స్కిల్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జైలు గురించి చర్చ జరుగుతోంది. మొదటి జైలు ఎక్కడ ఉంది. ఎప్పుడు ఏర్పాటు చేశారు. మొదటి జైలు ఇప్పటికీ అలాగే ఉందా అనే విషయాలు తెలుసుకుందాం.
అమెరికాలో తొలి జైలు..
ఈస్టర్న్ స్టేట్ పెనిటెన్షియరీ ప్రపంచంలోనే మొట్టమొదటి జైలు. దీనిని నిర్మించినప్పుడు ఆదర్శవంతమైన జైలుగా పేరు తెచ్చుకుంది. ప్రమాదకరమైన ఖైదీలకు జైల్లో ఎలా ఉండాలో సరిగ్గా ఇక్కడి వాతావరణం చూస్తే అర్థమవుతుంది. ఈ జైలు అనేక ఇతర జైళ్ల నిర్మాణానికి నమూనాగా నిలిచింది.
జైలుకు 194 ఏళ్లు ..
అమెరికా పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియా నగరంలోనే ఈ జైలు ఉంది. దీనిని1829లో ప్రారంభించినట్లుగా డైలీస్టార్ నివేదిక తన కథనంలో తెలిపింది. 1971 వరకు ఈ జైలు వాడుకలో ఉంది. ఆ తర్వాత ఓ పాత కట్టడంగా మిగిలిపోయింది. ముఖ్యంగా ఈ జైలు పేరు మోసిన ఖైదీలు, వాళ్లు అనుభవించిన కఠినమైన జైలుశిక్షలతోనే ఈ కారాగారం చాలా ఫేమస్ అయింది. మొదట్లో 250 మంది ఖైదీల కోసం మాత్రమే ఈ జైలును నిర్మించారు. అయితే 50 ఏళ్లలో ఖైదీల సంఖ్య 1000కు పైగా పెరిగింది.
నరకానికి నకళ్లుగా..
జైలు జీవితం అంటే భూమి మీద ఉండే నరకం అనే విధంగా నాడు జైళ్లు ఉండేదవి. అంతే కాదు నాటి కాలంలో ఈ జైలులో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఖైదీలు ఉండేవారట. ఈ జైల్లో ఇద్దరు ఖైదీలను చిన్న సెల్లో ఉంచారు. తర్వాత క్షయవ్యాధి లాంటి అంటు వ్యాధుల పుట్టుకు రావడం తర్వాత వరుసగా ఖైదీలు గుంపులు గుంపులుగా చనిపోవడంతో ఖెదీల మరణాల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
20 ఏళ్లు ఖాళీగానే..
ఈ జైలును 1971లో మూసివేశారు. ఆ తర్వాత సుమారు 20 సంవత్సరాలు ఖాళీగానే ఉంది. శిథిలావస్థకు చేరిన గోడల మధ్య జైలు నిండా పిల్లులు కాపురం పెట్టాయి. ఇప్పుడు ఆ జైలులో దెయ్యాలు తిరుగుతున్నాయని చెబుతారు. ఇదిలా ఉండగా, 1994లో చరిత్ర పర్యటనల కోసం జైలు ప్రజల కోసం తిరిగి తెరవబడింది. ఇప్పుడు ఈ జైలు అమెరికాలో అత్యంత చూడదగిన ప్రదేశాలలో ఒకటిగా అమెరికా ప్రకటించింది. విచిత్రమైన సంఘటనలు మరియు వివరించలేని భయానక శబ్దాలు ఇక్కడ వినబడతాయట.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: This is the world s first prison do you know how it is now
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com