Virat Kohli : కొంతకాలం నుంచి విరాట్ తనదైన స్థాయిలో ఆడలేక పోతున్నాడు. తన పరుగుల యంత్రం నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్ ను ఆవిష్కరించలేకపోతున్నాడు. దీంతో అతనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అతని ఆట తీరు మారాల్సిన అవసరం ఉందని మాటలు వినిపిస్తున్నాయి. మరో మూడు రోజుల్లో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదలుకానుంది. పెర్త్ వేదికగా ఈ టెస్ట్ ప్రారంభమవుతుంది.. తొలి టెస్ట్ కు కెప్టెన్ రోహిత్ దూరమయ్యాడు. అయితే ఈ మ్యాచ్లో అందరి కళ్ళు మొత్తం విరాట్ కోహ్లీ మీదే ఉన్నాయి. ఆస్ట్రేలియా అంటే చాలు వీరవిహారం చేసే విరాట్.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు చేసే కవింపు చర్యలకు.. స్లెడ్జింగ్ కు డబుల్ డోస్ తిరిగి ఇచ్చేస్తాడు. ఆస్ట్రేలియా మైదానాలపై టీమిండియా తరఫునుంచి మరే ఆటగాడు కూడా చూపించని దూకుడును కోహ్లీ ప్రదర్శిస్తాడు.. ఆస్ట్రేలియా గడ్డపై సునీల్ గవాస్కర్, సచిన్, రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్ సెంచరీల మోత మోగించారు. వారితో పోల్చితే కోహ్లీ పూర్తి విభిన్నం. వారంతా నిశ్శబ్దంగా ఆ పని చేస్తే.. కోహ్లీ మాత్రం థౌజండ్ వాలా లాగా పేలాడు. నిప్పు కణిక అనే పదానికి సిసలైన అర్థం చెప్పాడు. తన పేరు అంటే ఆస్ట్రేలియా బౌలర్లకు వణుకు పుట్టించేలాగా చేశాడు.
బౌన్సీ మైదానాలపై
ఆస్ట్రేలియా మైదానాలు బౌన్సీగా ఉంటాయి. ఆ మైదానాలపై ఆ దేశ బౌలర్లు ప్రత్యర్థి ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తారు. మిచల్ జాన్సన్, స్టార్క్, కమిన్స్, కమిన్స్ వంటి వాళ్లను ఒక ఆట ఆడుకున్న ఘనత మాత్రం విరాట్ దే. అందుకే విరాట్ అంటే ఆస్ట్రేలియా బౌలర్లకు భయం కలుగుతుంది. వెన్నులో వణుకు పుడుతుంది.. అయితే ప్రస్తుతం ఆ స్థాయిలో కోహ్లీ సత్తా చాటలేకపోతున్నాడు. చిరుతపులు లాగా వేటాడలేక పోతున్నాడు. అత్యంత వేగంగా పరుగులు తేలేకపోతున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఒకప్పుడు విరాట్ సెంచరీల మోత మోగించాడు. ఇప్పుడేమో పూర్తిగా డీలా పడిపోయాడు. అందువల్లే ఈసారి ఆస్ట్రేలియా గడ్డపై విరాట్ రాణించాలని అతడి అభిమానులు కోరుకుంటున్నారు. ఇటీవల న్యూజిలాండ్ సిరీస్ లో పూర్తిగా నిరాశపరిచిన విరాట్.. ఆస్ట్రేలియా గడ్డపై మాత్రం మర్చిపోవాలని అభిలషిస్తున్నారు. అయితే ఐదేళ్లలో విరాట్ కేవలం రెండే రెండు సార్లు సెంచరీలు చేయడం అభిమానులను కలవర పరుస్తోంది. కానీ ఈసారి పాత విరాట్ ను తెరపైకి తీసుకురావాలని.. వీర విహారం చేసి రికార్డులు సృష్టించాలని అతడి అభిమానులు కోరుతున్నారు. కాగా, విరాట్ సమకాలికుడు జో రూట్ టెస్టులలో సెంచరీల మీద సెంచరీలు చేస్తున్నాడు. ఫ్యాబ్ -4 లో చోటు సంపాదించుకున్నాడు. స్మిత్, కేన్ విలియంసన్ 30 సెంచరీల క్లబ్లో చేరారు. కోహ్లీ మాత్రం ఇంకా 29 సెంచరీ వద్ద నిలిచిపోయాడు. అయితే ఈసారి ఆస్ట్రేలియా టూర్లో అతడు గట్టి కం బ్యాంక్ ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు.
VIRAT KOHLI VINTAGE
13 TEST MATCHES IN AUSTRALIA
1352 RUNS
6 HUNDRED
4 FIFTIES
54.08 AVERAGEREASON FOR THE G.O.A.T pic.twitter.com/rUBpHw4nF6
— Sksportsmania (@khansalman88177) November 18, 2024
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Virats fans want him to excel against australia this time
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com