Mental Health: అండలుంటే కొండలైనా దాటొచ్చు అంటారు. మనకు మనసు బాగాలేనప్పుడు మన ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. అదే సమయంలో ఓదార్పు ఉంటే సాంత్వన ఉంటుంది. కొన్నిసార్లు ధైర్యం చెప్పే వారు లేకపోతే ఆత్మహత్య చేసుకునేందుకు సైతం వెనుకాడని పరిస్థితులు ఉంటాయి. అందుకే మనసుకు బాధ కలిగినప్పుడు ఓదార్పే మనకు శ్రీరామరక్ష అన్న సంగతి మరువకూడదు. ఎవరు మనల్ని ఓదార్చనప్పుడు మనకు మనమే సర్ది చెప్పుకోవాలి. ధైర్యం తెచ్చుకోవాలి. జీవితంలో ఎలాంటి సమస్యనైనా సునాయాసంగా ఛేదించి మన మార్కు చూపించుకోవాలి. అప్పుడే మన విలువ అందరికి తెలుస్తుంది.
కొందరికి ఓ చిత్రమైన అలవాటు ఉంటుంది. ఎవరేది చెప్పినా నో చెప్పరు. ఎంతటి విషయాన్ని అయినా చేస్తామని హామీ ఇచ్చి ఇఱుక్కుపోతారు. దీంతో వారికి లేనిపోని సమస్యలు వస్తాయి. ఎవరైనా ఏదైనా చెబితే అది మనకు కరెక్ట్ అనిపిస్తేనే సరే అనండి లేకపోతే నో చెప్పండి. అంతేకాని మొహమాటానికి పోతే మోసపోయేది మనమే. అలాగని ఎదుటివారితో వాదించడం కూడా సమంజసం కాదు. మీ మనసుకు ఓకే అనిపిస్తే సరే అనండి. లేకపోతే కుదరదని నిర్మొహమాటంగా చెప్పేయండి
మనలో చాలా మందికి డైరీ రాయడం అలవాటు ఉండదు. కానీ అది మంచి అలవాటు. ప్రతిరోజు డైరీ రాస్తే మంచి, చెడుల గురించి మనకు ఓ అవగాహన ఉంటుంది. మన ఆలోచన ధోరణి మారుతుంది. మనం రోజు రాసుకుంటే మన అనుభవాలు మనకు ఓ గుణపాఠంగా మారతాయి. పాజిటివ్, నెగెటివ్ లపై పట్టు సాధించడం వీలవుతుంది. దీంతో ఏది మంచో ఏది చెడో అనే భావనలు మనకు కొత్త మార్గాలను చూపిస్తాయి.
Also Read: Ram Gopal Varma- Mother’s Day: నేను ఓ మంచి కొడుకును కాదంటున్న రాంగోపాల్ వర్మ
మన చుట్టూ ఉండేవారి పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. మన హితులైతే ఫర్వాలేదు. కానీ అన్ని విషయాల్లో మనల్ని గేలి చేస్తూ వెనక్కి లాగే వారి విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి. అలాంటి వారిని దూరం ఉంచడమే శ్రేయస్కరం. ఎందుకంటే వారితో ఎప్పటికి ప్రమాదమే. విజయం కలిగినప్పుడు ప్రోత్సహించేవారు అపజయం ఎదురైనప్పుడు ఓదార్చే వారు నలుగురు లేకుంటే మనం జీవితంలో ముందుకు వెళ్లడం కష్టమే. అందుకే మనకు రక్షణగా ఉండేవారిని మనమే నిర్ణయించుకోవాలి.
ధ్యానం శరీరానికి చాలా మంచిది. ధ్యానంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి బాధలు ఉన్నా మనల్ని ఏం చేయలేవు. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనం పని చేయగలం. లేకపోతే ఏ పని కూడా చేయడానికి శక్తి చాలదు. దీంతో పనులు ముందుకు సాగవు. ఫలితంగా మనుగడ ఆగిపోతుంది. అందుకే వీలు దొరికినప్పుడు ధ్యానం చేస్తూ మనసుపై అదుపు ఉంచుకోవాలి. అప్పుడే మనం జీవితంలో రాణించగలం.
Also Read: Suriya- Director Bala Movie: కృతి శెట్టితో పాటు ఆమె కూడా రెడీ.. జ్యోతిక జోక్యం లేదు !
Recommended Videos:
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: These four are essential for mental health
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com