Homeటెలివిజన్‌Krishna Kaushik: కన్నడ నటుల డామినేషన్... మాకు పని మనిషి పాత్రలే అంటూ ఆవేదన చెందిన...

Krishna Kaushik: కన్నడ నటుల డామినేషన్… మాకు పని మనిషి పాత్రలే అంటూ ఆవేదన చెందిన తెలుగు యాక్టర్!

Krishna Kaushik: సీరియల్ యాక్టర్ కృష్ణ కౌశిక్ తెలుగు ఇండస్ట్రీలో కన్నడ నటుల డామినేషన్ ఎక్కువైందని అన్నారు. సీరియల్స్ లో తెలుగు వాళ్ళకి అవకాశాలు కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడి నుంచో తీసుకొచ్చి సీరియల్స్ లో హీరోయిన్ గా చూపిస్తున్నారని… దీనికి ప్రధాన కారణం ఒకటే అని కౌశిక్ తెలియజేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకి హాజరైన నటుడు కృష్ణ కౌశిక్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సీరియల్ నటుడు కౌశిక్ చైల్డ్ ఆర్టిస్ట్ గా 10 కి పైనే సినిమాల్లో నటించారు. ఇప్పటివరకు 31 వరకు సీరియల్స్ చేశారు. ఈటీవీలో దాదాపు 17 సీరియల్స్ వరకు చేయగా, అందులో కౌశిక్ హీరోగా 12 సీరియల్స్ తెరకెక్కాయి. ఇప్పుడు అవకాశాలు లేక కాస్త వెనుక బడ్డారు. కానీ ఒకప్పుడు ఆయన బుల్లితెర పై స్టార్ ఇమేజ్ అనుభవించారు. తెలుగు వాళ్లకు సీరియల్స్ లో ఆఫర్స్ తగ్గిపోవడం పై ఆవేదన వ్యక్తం చేశాడు. కన్నడ నటీనటులను తెలుగు ఇండస్ట్రీలో ఎందుకు తీసుకుంటున్నారు? మీలాంటి సీనియర్ నటులు దీని గురించి మాట్లాడరా? అని యాంకర్ ప్రశ్నించారు.

దీనికి కౌశిక్ మాట్లాడుతూ .. కేవలం తెలుగు వాళ్లకు ఒక్క పని మనిషి పాత్ర మాత్రమే మిగిలింది. మిగిలినవన్నీ కన్నడ యాక్టర్స్ తో చేయిస్తున్నారు. కన్నడలో మనం వెళ్లి యాక్ట్ చేస్తానంటే వాళ్ళు కాలు కూడా పెట్టనివ్వరు. ఇదంతా యూనిటీ పై ఆధారపడి ఉంటుంది అని అన్నారు. కన్నడ ఇండస్ట్రీలో అంతటి స్ట్రాంగ్ యూనిటీ ఉంటుందని .. మన దగ్గర అది లేదని కౌశిక్ ఒకింత అసహనం వ్యక్తం చేశాడు.

ఈ యూనిటీ లేకనే తెలుగులో దాదాపు కన్నడ యాక్టర్స్ ఎక్కువగా కనిపిస్తున్నారని కౌశిక్ చెప్పుకొచ్చాడు. మీరు ఇప్పటివరకు నటించిన సీరియల్స్ వాళ్ళు ఎవరైనా డబ్బులు ఎగ్గొట్టారా అని అడగ్గా .. చాలా మంది ఉన్నారు అని చెప్పారు. నాకు రూ. 15 లక్షలు దాకా రావాల్సి ఉండగా , అవి ఇక రావని వదిలేసుకున్నాను. మా కష్టానికి రెమ్యూనరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్లదే. ఇవ్వకపోతే కత్తి పెట్టి బెదిరించలేము కదా. ఆ విధంగా ఇప్పటివరకు దాదాపు రూ. 15 లక్షలు పోగొట్టుకున్నాను అని కౌశిక్ చెప్పుకొచ్చారు.

RELATED ARTICLES

Most Popular