Jabardasth Rohini: జబర్దస్త్ లేడీ కమెడియన్ రోహిణిని పోలీసులు అరెస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఓ రేవ్ పార్టీలో పాల్గొన్న ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. నాకేమీ తెలియదంటూ రోహిణి వేడుకోవడం ఆ వీడియోలో మనం చూడొచ్చు. ఇంతకీ ఏమి జరిగింది?.. ఇటీవల నటి హేమ అరెస్ట్ టాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. బెంగుళూరు నగర శివారులో గల ఒక ఫార్మ్ హౌస్లో రేవ్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో నటి హేమ పాల్గొన్నారు.
పార్టీలో డ్రగ్స్ వాడుతున్నారని సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నటి హేమ కూడా రేవ్ పార్టీలో పాల్గొన్నారని బెంగుళూరు పోలీసులు ప్రకటించారు. నటి హేమ ఖండించారు. నేను బెంగుళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. హైదరాబాద్ లోని ఓ ఫార్మ్ హౌస్లో చిల్ అవుతున్నానని వీడియో బైట్ విడుదల చేసింది. హేమ అబద్దం చెప్పినట్లు తెలిసింది. విచారణకు పిలిచిన అధికారులు హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు తేల్చారు. అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.
అదే తరహా ఉందంతం హైదరాబాద్ లో జరిగింది. జబర్దస్త్ లేడీ కమెడియన్ రోహిణి రేవ్ పార్టీలో పాల్గొంది. ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. రోహిణి అరెస్ట్ వీడియో వైరల్ అవుతుంది. నాకేమీ తెలియదు. బర్త్ డే పార్టీ అంటే వచ్చాను. నేను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు. నాకు పరీక్షలు జరగలేదని ఆమె అన్నారు. ఇలాంటి ఎన్నారై బర్త్ డే పార్టీలు అంటే వివరాలు తెలుసుకోకుండా రావద్దని ఆ వీడియోలో రోహిణి ఆవేదన చెందడం మనం చూడొచ్చు.
అయితే రోహిణి అరెస్ట్ ఫేక్ అని తెలుస్తుంది. ఓ మూవీ ప్రమోషన్ కోసం ఆమె ఫ్రాంక్ చేశారని సమాచారం. రోహిణి నిజంగా అరెస్ట్ కాలేదు. పబ్లిసిటీ స్టంట్ లో భాగంగా ఈ వీడియో సోషల్ మీడియాలో వదిలారు. ఈ మధ్య చిన్న చిత్రాలు, సిరీస్ల ప్రమోషన్స్ కోసం ఫ్రాంక్ వీడియోలు చేయడం పరిపాటిగా మారింది. నివేద పేతురాజ్ తన లేటెస్ట్ వెబ్ సిరీస్ పరువు ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఫ్రాంక్ వీడియో చేసింది. పోలీసులు తన కారును అడ్డగించి సోదా చేయాలి అంటే, ఆమె సహకరించనట్లు ఆ ఫ్రాంక్ వీడియోలో చిత్రీకరించారు. అది నిజమని కొందరు నమ్మారు. తర్వాత ఫ్రాంక్ అని తెలిసింది. రోహిణి కూడా ఫ్రాంక్ చేశారని సమాచారం.
Fun alert : Anchor #Rohini Arrested in a Rave Party #tollywoodactress #tollywood #HEMA pic.twitter.com/nfos9IEIej
— Phani Kumar (@phanikumar2809) July 5, 2024