HomeతెలంగాణYouTuber Vaishnavi viral video: చనిపోయి పాముగా మారిన యూట్యూబర్ వైష్ణవి.. గుండెలు పిండేసే వీడియో

YouTuber Vaishnavi viral video: చనిపోయి పాముగా మారిన యూట్యూబర్ వైష్ణవి.. గుండెలు పిండేసే వీడియో

YouTuber Vaishnavi viral video: ఆమె చలాకీగా ఉంటుంది. ఆమె మాటల్లో ఉత్సాహం ప్రతిబింబిస్తూ ఉంటుంది. చిన్నప్పటినుంచి ఆమెకు నలుగురితో మాట్లాడటం.. నలుగురిని నవ్వించడం ఇష్టం. బహుశా దానివల్లే కావచ్చు పెరిగి పెద్దయిన తర్వాత.. ఆ మాటలనే తన కెరీర్ కు బంగారు బాటలుగా మార్చుకుంది. అవకాశాలను వెతుక్కుంటూ కాకుండా.. తానే అవకాశాలను సృష్టించుకుంది. ఫలితంగా ఫేమస్ యూట్యూబర్ అయిపోయింది. ఆవిడే వైష్ణవి.

వైష్ణవి ఫేమస్ యూట్యూబర్. లక్షల్లో ఆమెకు అభిమానులు ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆమె సొంత ప్రాంతం. యూట్యూబర్ గా పేరు తెచ్చుకున్న తర్వాత.. ఆమె పాపులారిటీ మరింత పెరిగిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే సెలబ్రిటీ అయిపోయింది. అయితే ఆమెకు సోషల్ మీడియాలో ఒక యువకుడు పరిచయం అయ్యాడు. వారిద్దరి మధ్య పరిచయం స్నేహంగా మారింది. అది ప్రేమకు దారితీసింది. వైష్ణవి వ్యవహారం ఇంట్లో తెలియడంతో కుటుంబ సభ్యులు వారించారు. ప్రేమ, గీమ కుదరవని చెప్పారు. దీంతో వైష్ణవి మనసు మార్చుకుంది. కానీ ఆమెను ఆ యువకుడు మర్చిపోలేకపోయాడు. మళ్లీ ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. చివరికి ఆమెను మళ్లీ తన దారిలోకి తెచ్చుకున్నాడు.

ఈసారి కుటుంబ సభ్యులు వారించినప్పటికీ వైష్ణవి తన తీరు మార్చుకోలేదు. ఇంట్లో చెప్పకుండా ఆ యువకుడిని ప్రేమ పెళ్లి చేసుకుంది. అప్పటిదాకా ప్రేమను నటించిన ఆ వ్యక్తి తనలో ఉన్న అసలు రూపాన్ని చూపించాడు. వైష్ణవిని నిత్యం కొడుతూ ఉండేవాడు. వేధిస్తూ ఉండేవాడు. హింసిస్తూ ఉండేవాడు. అతడు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక ఇటీవల వైష్ణవి కన్ను మూసింది. ఈ ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. అయితే వైష్ణవి చనిపోవడాన్ని ఇప్పటికీ ఆమె కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల వైష్ణవి మృతదేహాన్ని దహనం చేసిన చోట కుటుంబ సభ్యులు పిట్టకు వేసే కార్యక్రమాన్ని చేపట్టారు. కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక పామువారికి కనిపించింది. ఆ పాము కూడా వైష్ణవి మృతదేహాన్ని దహనం చేసిన చోట తిరిగింది. దీంతో కుటుంబ సభ్యుల దుఃఖానికి అంతులేకుండా పోయింది.

” నా బిడ్డకు ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పాడు. చివరికి తనను లొంగదీసుకున్నాడు. . ప్రేమ పేరుతో వంచించి చంపేశాడు. నా బిడ్డ వైష్ణవి మమ్మల్ని వదిలి వెళ్ళలేక ఇదిగో ఇలా పాము రూపంలో తిరుగుతోందని” ఆమె కుటుంబ సభ్యులు ఉబికి వస్తున్న దుఃఖంతో చెప్పారు. కాగా, ఆపాము వైష్ణవి మృతదేహాన్ని దహనం చేసిన నాటి నుంచి అక్కడే తిరుగుతూ ఉండడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version