Hyderabad live-in Relationships: అమ్మాయితో అబ్బాయికి పరిచయం ఉండదు. ఒక అబ్బాయి గురించి అమ్మాయికి ఏమీ తెలియదు. అలాంటివారు ఒకే చోట కలిసి ఉంటే.. ఒకే గదిలో నివాసం ఉంటే.. తినే తిండిని.. తాగే నీటిని.. పడుకునే పడకను పంచుకుంటే.. చదువుతుంటే ఇబ్బందిగా ఉంది కదూ.. అలా ఎలా సాధ్యమవుతుందని ప్రశ్న మీలో వ్యక్తమవుతోంది కదూ.. కానీ ఈ కల్చర్ హైదరాబాదులో ఇప్పుడు సాధారణమైపోయింది.
Also Read: సీఎం రేవంత్ కే ఎసరు పెట్టిన పంచాయితీ కార్యదర్శి?
ఐటీ కార్యకలాపాలు ఎక్కువగా సాగే రాయదుర్గం, మాదాపూర్, నానక్ రామ్ గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నెక్ నాం పూర వంటి ప్రాంతాలలో ఈ కల్చర్ సర్వసాధారణమైపోయింది. ఈ ప్రాంతాలలో ఒకప్పుడు పురుషులకు, స్త్రీలకు వేరువేరుగా హాస్టల్స్ ఉండేవి. ఇటీవల కాలంలో కో లివింగ్ కల్చర్ అనేది అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల ఎటువంటి సంబంధం లేని వారు ఒకే హాస్టల్ లేదా ఇంట్లో ఉంటున్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఎక్కువగా ఈ సంస్కృతికి ప్రాధాన్యమిస్తున్నారు. హాస్టల్ యజమానులు యువతి యువకులను ఆకర్షించడానికి అద్భుతమైన సౌకర్యాలను కల్పిస్తున్నారు. అధునాతనమైన స్విమ్మింగ్ ఫూల్, ఫర్నిచర్, కిచెన్, ఏసి, టీవీ, వైఫై, వాషింగ్ మిషన్ వంటివి కల్పిస్తున్నారు. సౌకర్యాల ఆధారంగా ఒక్కొక్కరి వద్ద ఎనిమిది వేల నుంచి 25వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆడవారితో కలిసి ఉండే అవకాశం ఉండడంతో ఎంతైనా చెల్లించడానికి ఐటి ఉద్యోగులు వెనుకాడటం లేదు. మంచి వెనుక చెడు ఉన్నట్టు.. కొందరు హాస్టల్ నిర్వాహకులు ఈ విషయాన్ని ఆసరాగా తీసుకొని దందాకు పాల్పడుతున్నారు.
అందమైన అమ్మాయిలను మీ రూమ్మేట్ గా సెట్ అబ్బాయిలను దోచేసుకుంటున్నారు. అంతేకాదు కో లివింగ్ రిలేషన్ గురించి తల్లిదండ్రులకు చెబుదామని బెదిరిస్తున్నారు.. అయితే ఈ కో లివింగ్ రిలేషన్ గురించి తల్లిదండ్రులకు పిల్లలు చెప్పడం లేదు. అయితే కో లివింగ్ లో ఉన్నవారు కొన్ని సందర్భాలలో తప్పులు చేస్తున్నారు. హాస్టల్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో ఈ దృశ్యాలు రికార్డు అవుతున్నాయి. ఆ దృశ్యాలు అసాంఘిక శక్తుల చేతులలోకి వెళ్తున్నాయి.
Also Read: తెలుగు రాష్ట్రాల్లోని వారికి శుభవార్త.. వరుసగా 3 రోజులు సెలవులు..
కో లివింగ్ కల్చర్ పై కొంతమంది సానుకూలంగా మాట్లాడుతున్నారు. రూమ్ షేర్ చేసుకోవడం మినహా.. మిగతావి ఏవీ ఉండవని చెబుతున్నారు.. అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారని.. ఐటీ ఉద్యోగులు విపరీతమైన ఒత్తిడితో ఉంటారని.. ఇలాంటి సమయంలో వారికి సాంత్వన కావాలని.. అలాంటప్పుడు తెలియని ఒక వ్యక్తితో మాట్లాడితే తప్పేముందని చెబుతున్నారు. విదేశాలలో ఈ కల్చర్ కామన్ అని.. హైదరాబాద్ ఇప్పుడు కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి ఆ కల్చర్ కు ఇక్కడి ఉద్యోగులు అలవాటు పడుతున్నారని హాస్టల్ నిర్వాహకులు అంటున్నారు. తాము కల్పిస్తున్న సౌకర్యాలకు తగ్గట్టుగానే డబ్బులు వసూలు చేస్తున్నామని.. ఇందులో ఎటువంటి దందాకు పాల్పడటం లేదని చెబుతున్నారు.