Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. దీంతో సహజంగానే బీఆర్‌ఎస్ నేతలు అధికార పార్టీవైపు చూస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచంలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత మరో ఏడుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై గులాబీ నేతలు స్పీకర్‌పై ఫిర్యాదు చేశారు. తర్వాత కోర్టులో పటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నెల రోజుల్లో విచారణ ప్రారంభించాలని అసెంబ్లీ సెక్రెటరీని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. స్పీకర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో స్పీకర్ పీఏసీ చైర్మన్, సభ్యులను నియమించారు. చైర్మన్ పదవిని పార్టీ మారిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాందీకి ఇవ్వడం మరింత చర్చనీయాంశమైంది.
వ్యూహాత్మకంగా..
ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో కాంగ్రెస్ ప్రత్యేక వ్యూహం అనుసరిస్తోందా? అందులో భాగమే అరికపూడి గాంధీ పీఏసీ చైర్మన్ ఎంపికా? ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పరిగణించి ఎంపిక చేసినట్టు స్పీకర్ చేసిన ప్రకటన దేనికి సంకేతం? మిగతా 9 మందిని అలాగే ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా పరిగణిస్తారా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ. కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో నాలుగు వారాల్లో సరైన నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో సర్వత్రా ఇదే చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ అరికపూడి గాంధీ ఎంపిక నిర్ణయం రాజకీయ సంచలనం సృష్టించింది. అసలు స్పీకర్ ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకున్నారు.. దీని వెనుక ఉన్న పొలిటికల్ ఈక్వేషన్ ఏంటా అని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి స్పీకర్ తీసుకోబోయే నిర్ణయానికి ఏమైనా లింక్ ఉందా అన్న చర్చ కూడా ఉంది.
న్యాయనిపుణుల సలహాతో..
కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నట్టు సమాచారం. వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలపై అనర్హత కేసులను స్టడీ చేసినట్టు తెలుస్తోంది. అయితే వ్యూహాత్మకంగా ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ ఎంపిక సాగినట్టు తెలుస్తోంది. స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చాలా అనుమానాలకు తావిస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 10 మంది బీఆర్‌ఎ ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. అందులో అరికపూడి గాంధీ ఒకరు. పీఏసీ చైర్మన్ గా ఎన్నికైన అరికపూడి గాంధీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఐతే మరి మిగితా 9 మంది తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ వాళ్ల.. లేక కాంగ్రెస్ వాళ్లా అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఈ పది మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారా.. అనే సందేహం అందరిలో మెదులుతుంది. అయితే సడన్‌గా ఎమ్మెల్యేలు ఇలా స్టాండ్. మార్చడానికి ఒక బలమైన కారణం లేకపోలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యేల అనర్హత అంశం నెల రోజుల్లో స్పీకర్ ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ఈ పరిణామం కాస్తా రాజకీయంగా ప్రకంపనలు రేపుతుంది. అంటే కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యలను అనర్హత నుంచి బయటపడేసేందుకే కాంగ్రెస్ ఈ వ్యూహం అమలు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Will congress strategy to save those ten people work
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com