https://oktelugu.com/

RS Praveen Kumar’s House: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో దోపిడీ ఎందుకు జరిగింది? ఆ కీలక పత్రాలు ఎందుకు ఎత్తుకెళ్లారు?

బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో ఇటీవల చోరీ జరిగింది. ఆయన స్వస్థలం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ కాగజ్‌నగర్‌లోని ఇంట్లో ఈ చోరీ జరిగినట్లు ఆర్ఎస్పీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. కోసిని గ్రామంలోని తన ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి విలువైన పత్రాలు ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 1, 2024 / 02:48 PM IST

    BRS-Leader

    Follow us on

    RS Praveen Kumar’s House: బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో ఇటీవల చోరీ జరిగింది. ఆయన స్వస్థలం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ కాగజ్‌నగర్‌లోని ఇంట్లో ఈ చోరీ జరిగినట్లు ఆర్ఎస్పీ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. కోసిని గ్రామంలోని తన ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి విలువైన పత్రాలు ఎత్తుకెళ్లినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో దోపిడీ దొంగల పాలన నడుస్తోందని, దానికి ఈ చోరీనే నిదర్శనమని పేర్కొన్నారు. విలువైన డాక్యుమెంట్లు దోచుకొని పోవడంపై మండిపడ్డారు.

    గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రవీణ్ కుమార్ కాగజ్‌నగర్‌లో ఇల్లు కొనుగోలు చేశారు. గత ఎన్నికల్లో ఆర్ఎస్పీ కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. దాంతో ఆ ఇంటి నుంచే ఆయన ప్రచార కార్యక్రమాలు సాగించారు. ప్రచారంలో పాల్గొని వచ్చిన ఆయన ఆ ఇంట్లోనే రెస్ట్ తీసుకునే వారు. పది నెలలుగా లేనిది.. ఇప్పుడు ఒక్కసారిగా ఆ ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి లోనికి వెళ్లారు. బీరువా తాళాలు సైతం పగలగొట్టి విలువైన పత్రాలను ఎత్తుకెళ్లారు. ఘటన జరిగిన సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేరు. ఆర్ఎస్పీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు.. ఇందులో కుట్ర కోణం దాడి ఉన్నట్లు ఆర్ఎస్పీ ఆరోపించారు. ఆ కుట్రకోణాన్ని శోధించాలని డీజీపీని విజ్ఞప్తి చేశారు.

    ఆర్ఎస్పీ అంతకుముందు బీఎస్పీలో కొనసాగారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తరువాతి పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే.. ఆయన సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి బరిలోకి దిగగా.. ఓటమి పాలయ్యారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మరోవైపు.. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలంటూ పలు సందర్భాల్లో డిమాండ్ వినిపించారు. ఇటీవల గ్రూప్ 1 విషయంలోనూ వ్యతిరేకించారు. మూసీ, హైడ్రాలను కూడా వ్యతిరేకించారు. ప్రధానంగా ప్రజల పక్షాన తన వాయిస్ వినిపిస్తూ వచ్చాయి. అయితే.. ఆర్ఎస్పీ ఇంట్లో చోరీ జరగడం… విలువైన పత్రాలు చోరీజరగడం సంచలనంగా మారింది. దానికితోడు ప్రవీణ్ కుమార్ సైతం కుట్ర కోణం దాగి ఉన్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో డీజీపీ వరకూ ఫిర్యాదు చేశారు. అయితే ఈ చోరీపై ఇప్పటివరకు పోలీసుల నుంచి మాత్రం ఎలాంటి రిప్లై రాలేదు. ఈ టైములో ఆయన ఇంట్లో చోరీ జరగడం ఏంటి..? కీలక పత్రాలు ఎందుకు దోచుకెళ్లారు..? ఆ పత్రాలు ఏంటి..? అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. కాంగ్రెస్ పాలనపై ఆర్ఎస్పీ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలనను దోపిడీ పానలతో పోల్చారు. కాంగ్రెస్ అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో దోపిడీలు పెరిగినట్లుగా ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ నేతలు కూడా పెద్దగా స్పందించలేదు. ఎవరు కూడా కౌంటర్ ఇవ్వలేదు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రతీ ఆరోపణలకు కౌంటర్ ఇస్తున్న కాంగ్రెస్ నేతలు.. ఆర్ఎస్పీ మాటలను ఎందుకు లైట్ తీసుకున్నారనేది తెలియకుండా ఉంది. మొత్తానికి ఆర్ఎస్పీ ఇంట్లో జరిగిన చోరీని పోలీసులు మాత్రం సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే సీసీ కెమెరాలు తనిఖీ చేసినట్లు తెలిసింది.

    కాంగ్రెస్ సర్కార్ కుంభకోణాలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదో సేకరించాడని.. పలు డాక్యుమెంట్లు తయారు చేశాడని గుసగుసలు వినపిస్తున్నాయి. ఈ విషయం లీక్ అయ్యి కొందరు దొంగలు పడి ఆ కీలక పత్రాలు తీసుకెళ్లారని ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని ఆనోట ఈనోట పలువురు చెప్పుకుంటున్నారు. మరి ఇందులో నిజం ఎంతుందో కానీ.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో దోపిడీ జరగడం.. కీలక పత్రాలు పోవడం చూస్తే ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.