https://oktelugu.com/

Ratan TATA: రతన్ టాటా జేబులో రూపాయి లేదు.. ఆయనతో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న బిగ్ బీ

రతన్ టాటా నా వద్దకు వచ్చి ఫోన్ చేసేందుకు డబ్బుల లేవని చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ చైర్మన్ జేబులో డబ్బులు లేకపో...

Written By:
  • Mahi
  • , Updated On : November 1, 2024 3:00 pm

    Ratan TATA(7)

    Follow us on

    Ratan TATA: రతన్ టాటా ఆయన గురించి చెప్పుకునేందుకు అక్షరాలు సరిపోవు.. పేజీలు చాలవు. భారతదేశానికి టాటాలు అందించిన ఆణిముత్యం ఆయన. ఏ రోజు ఆయన సుఖ సంతోషాలు చూసుకోలేదు. పేదలు వారి అభివృద్ధి, దేశం ప్రపంచంలో ముందుకు ఎలా వెళ్లాలి. ఆయన మనస్సులో, మస్తిష్కంలో ఈ రెండు అంశాలు మాత్రమే ఉండేవి. రతన్ టాటా టాటా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి వ్యాపారాన్ని వందలాది దేశాలకు విస్తరించారు. వేలాది ప్రొడక్ట్ లను తెచ్చారు. కోట్లాది రూపాయలు ఆర్జించారు. దాదాపు అంతే స్థాయిలో పేదల కోసం దానం చేశారు. కొవిడ్ సమయంలో ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ. 1500 కోట్లు ఇచ్చారంటే ఆయనకు భారత్ అన్నా భారత్ లో ప్రజలు అన్నా వారి ప్రాణాలు అన్నా ఎంత గౌరవమో అర్థం చేసుకోవచ్చు. గొప్ప గొప్ప వ్యక్తులను స్మరించుకుంటే చాలు మనకు గొప్ప గొప్ప ఆలోచనలు పుడతాయిన పెద్దలు చెప్పిన వ్యాఖ్యం ఈ కోవలో మొదటి వాడు, నిత్యం స్మరించుకునే మహానుబావుడు రతన్ టాటా. తన వ్యక్తి గత జీవితం గురించి ఆయన ఏనాడూ ఆలోచించలేదు. సమాజం, పేదవారి కోసమే కష్టపడ్డాడు. రెండు దశాబ్ధాలు టాటా గ్రూప్ ను నడిపిన ఆయన తరతరాలుగా సంపదను పుట్టించే వైపునకు గ్రూపును అడుగులు వేయించాడు. కోట్లాది బిలియన్ రూపాయలను ట్రస్ట్ పేరుతో పేదలకే పంచిన మహోన్నత వ్యక్తి రతన్ టాటా. అతని గురించి ఇటీవల షాహెన్ షా ఆఫ్ బాలీవుడ్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ గుర్తు చేసుకున్నారు. రతన్ టాటా మరణం తర్వాత సోషల్ మీడియాలో నివాళులర్పిస్తూ మొదటి ట్వీట్ చేసింది బిగ్ బీనే. ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ప్రోగ్రామ్ లో రతన్ టాటాతో తనకు ఉన్న అనుభవాలను పంచుకున్నాడు.

    బిగ్ బీ మాట్లాడుతూ ‘టాటా లండన్ పర్యటనకు వెళ్లి తిరుగు ప్రయాణం అయిన సందర్భంలో ఆయన ప్రయానించే విమానంలో నేను ప్రయాణించాను. హీత్రూ విమానాశ్రయంలో రతన్ టాటాతో పాటు నేను దిగాను. టాటా తన సహాయకుల కోసం వెతికారు. కానీ వారు కనిపించలేదు. దీంతో ఫోన్ చేసుకునేందుకు ఫోన్ బూత్ లోకి వెళ్లారు. కానీ చేయకుండానే తిరిగి వచ్చారు. నా వైపు వచ్చి వినయపూర్వకంగా ‘అమితాబ్, నేను మీ నుంచి కొంత డబ్బు తీసుకోవచ్చా? ఫోన్ చేయడానికి నా దగ్గర డబ్బు లేదు.’ అని చెప్పారు. ఆ క్షణం నాకు మాటలు రాలేదు. ప్రపంచంలో అతిపెద్ద కంపెనీ అయిన టాటా చైర్మన్ జేబులో డబ్బు లేకపోవడమా? ఆశ్చర్యం వేసింది. ఆ సమయంలో ఆయన నాకు సాధారణమైన వ్యక్తిగా కనిపించాడు.’ అన్నారు.

    మరో సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ‘నా ఫ్రెండ్స్ తో ఒక ఈవెంట్ కు వెళ్లాం. ఆ ఈవెంట్ కు రతన్ టాటా గారు కూడా హాజరయ్యారు. ఈవెంట్ ముగిసిన తర్వాత రతన్ టాటా నా స్నేహితుడి వద్దకు వచ్చి ‘నన్ను ఇంటి వద్ద దింపగలవా? నేను మీ ఇంటి వెనకే నివసిస్తున్నాను.’ నా వద్ద కారు లేదు అని అడిగారు. అదేంటి ప్రపంచంలోనే భారీ బ్రాండ్ కార్లు జాగ్వార్, ల్యాండ్ రోవర్ వంటివి తయారు చేసే టాటా కంపెనీ చైర్మన్ కు సొంత కారు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇలాంటి వారు యుగానికి ఒక్కరు వస్తారేమో ఆయనను చూస్తేనే అర్థం అయ్యింది.