L&T Hyderabad Metro: హైదరాబాద్ నగరంలో దీర్ఘకాలంగా మెట్రో రైల్ ను ఎల్ అండ్ టీ సంస్థ నిర్వహిస్తోంది.. సేవల విషయంలోనూ సమర్థవంతంగా వ్యవహరిస్తోంది. అయితే అటువంటి సంస్థ మెట్రో రైలు ప్రాజెక్టు నుంచి తప్పుకుంటామని వ్యాఖ్యానించడం సంచలనం కలిగిస్తోంది. దీనికి తోడు ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి కీలక నాయకుడు కేటీఆర్ ముడుపుల వల్లే ఎల్ అండ్ టీ మెట్రో నుంచి వెళ్ళిపోతోందని ఆరోపించారు. దీంతో ఎల్ అండ్ టీ వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారింది..
Also Read: ఐసీసీ ఏ హే పో అనేసింది.. పాకిస్తాన్ కు దిక్కు లేక బిక్క చచ్చింది! ఏం ర్యాగింగ్ రా ఇది!
మెట్రో ప్రాజెక్ట్ నుంచి పదేపదే వెళ్ళిపోతామని ఎల్ అండ్ టీ చెబుతుండడం పట్ల రేవంత్ ప్రభుత్వం కూడా సీరియస్ గానే దృష్టి సారించినట్టు తెలుస్తోంది.. పదేపదే వెళ్ళిపోతామని చెబితే.. దానికి తాము సరే అంటామని ప్రభుత్వం చెప్పినట్టు తెలుస్తోంది. మెట్రో రెండో దశ ప్రాజెక్టు ను రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించి.. నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో మొదటి దశ కూడా తామే నిర్వహిస్తామని ప్రభుత్వం ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది.. అప్పులు, వడ్డీలు అధికంగా ఉన్నాయని ఎల్ అండ్ టీ చెబుతుండగా.. ఇచ్చిన ఆస్తులు నిర్వహణ సరిగా లేదని ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. అంతర్గతంగాను మెట్రో రైలు నిర్వహణ తనకు ఏమాత్రం ఉపయుక్తంగా లేదని ఎల్ అండ్ టీ అంతర్గతంగా వ్యాఖ్యానించింది. లేఖలు కూడా రాసింది.. మరోవైపు రెండోదశ నిర్మాణానికి సంబంధించి మొదటి విడతలో 24,259 కోట్లు, రెండవ విడుదల 19,450 కోట్లతో ప్రభుత్వమే విస్తరణ చేపడుతుందని ఇటీవల ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
హైదరాబాదులో మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని అన్ని ప్రాంతాలను మెట్రో రైలు తో అనుసంధానించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇంతటి భారీ విస్తరణకు ప్రణాళికలు చేపట్టిన ప్రభుత్వం.. మొదటి విడత నిర్వహణను చేతుల్లోకి తీసుకోవడానికి ఇబ్బంది ఉండదని భావిస్తోంది. అయితే ప్రభుత్వం తానంతట తానుగా ఆ ప్రతిపాదన పెట్టదని.. ఒకవేళ ఎల్ అండ్ టీ ఓకే అంటే మాత్రం వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. మనదేశంలో చాలా రాష్ట్రాలలో ప్రభుత్వాలే మెట్రో రైలు వ్యవస్థను నిర్వహిస్తున్నాయి. తెలంగాణలో కూడా అదే విధంగా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అవసరమైతే దీనికోసం ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచన ప్రభుత్వ మదిలో ఉంది. నిధుల సమీకరణ కూడా దీనికోసం పనికి వస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఎల్ అండ్ టీ కి కేటాయించిన ఆస్తుల విషయంలో నిర్వహణ సరిగా లేకపోవడంతో ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. ఆస్తుల నిర్వహణ కూడా ప్రభుత్వం చేతికి వస్తే ఆర్థికంగా భారం కూడా ఉండదని తెలుస్తోంది.