https://oktelugu.com/

KCR : బాపుకు ఏమైంది.. బేటా మీద కేసు పెట్టినా కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదు.. ఫామ్‌హౌస్‌ ఎందుకు వీడడం లేదు?

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం నమోదైంది. మాజీ ముఖ్యమైన మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావుపై ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈడీ కూడా రంగంలోకి దిగింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 21, 2024 / 12:17 PM IST

    KCR

    Follow us on

    KCR :  తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. గత ప్రభుత్వం హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈరేసు వ్యవహారంలో రూ.56 కోట్ల రూపాయలు ఎలాంటి అనుమతి లేకుండా ఓ విదేశీ సంస్థకు కేటాయించినట్లు తేలింది. రిజర్వు బ్యాంకు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.8 కోట్ల జరిమానా కూడా విధించింది. కేటాయించిన తర్వాత కూడా దానిని ప్రభుత్వం ఆమోదించలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ నిధులు దారిమళ్లినట్లు భావించింది. నాడు మున్సిపల్‌ మంత్రిగా ఉన్న కేటీఆర్‌ ఆదేశంతోనే నిధులు కేటాయించినట్లు అప్పటి ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అరవింద్‌కుమార్‌ తెలిపారు. దీంతో కేటీఆర్‌పై విచారణకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం గవర్నర్‌ను కోరింది. పూర్వపరాలు పరిశీలించిన గవర్నర్‌ విచారణకు అనుమతి ఇచ్చారు. దీంతో ఏసీబీ వెంటనే కేసు నమోదు చేసింది. ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన కొన్ని గంటల్లోనే రంగంలోకి దిగిన ఈడీ ఎఫ్‌ఐఆర్‌ కాపీతోపాటు డాక్యుమెంట్లు ఇవ్వాలని ఏసీబీకి లేఖ రాసింది. మరోవైపు కేటీఆర్‌ ఎఫ్‌ఐఆర్‌ కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు కేటీఆర్‌కు పది రోజులు ఉపశమనం కల్పించింది. విచారణ కొనసాగించాలని అనుమతి ఇచ్చింది. 48 గంటల్లోనే ఈ వ్యవహారాలన్నీ చకచకా జరిగాయి. అయినా కేటీఆర్‌ తండ్రి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం నోరు మెదపడం లేదు. ఫామ్‌హౌస్‌ వీడి బయటకు రావడం లేదు. ఎన్నికల్లో గడిచిన ఏడాది కాలంలో ఒక్క రోజు మాత్రేమే అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్‌.. తర్వాత ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు. దీంతో కేసీఆర్‌కు ఏమైంది అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. క్యాడర్‌లో కూడా ఈ ప్రశ్నలకు సమాధానం లేక గందరగోళం నెలకొంది.

    తనకు సంబంధం లేదన్నట్లు..
    తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావంలో కేసీఆర్‌ పాత్ర కీలకమైనది. అందుకే తెలంగాణ ప్రజలు 2024, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ సారథ్యంలోని గులాబీ పార్టీని గెలిపించారు. దాదాపు పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్‌.. 2023 ఎన్నికల్లో పార్టీని గెలిపించలేదు. దీంతో ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. ఓడిపోగానే తెలంగాణతో, తెలంగాణ ప్రజలతో తనకు సంబంధం లేదన్నట్లు ఫాంహౌస్‌కు పరిమితమయ్యారు. రాష్ట్రంలో ఏం జరిగినా స్పందించడం లేదు. చివరకు తన కొనడుకు కేటీఆర్‌పై కేసు నమోదు చేసినా స్పందించలేదు. తనను గెలిపించిన ప్రజల తరఫున మాట్లాడేందుకు కూడా అసెంబ్లీకి రావడం లేదు.

    ఎందుకీ మౌనం?:
    కేటీఆర్‌ అరెస్ట్‌ అయ్యే పరిస్థితి వచ్చినా.. ఏసీబీ, ఈడీ రెండూ ఫార్ములా ఈరేసు కేసుపై ఆరా తీస్తున్నా.. కేసీఆర్‌ మౌనం వీడడం లేదు. కోర్టు పది రోజుల గడువు ఇచ్చింది. పది రోజుల తర్వాత కేటీఆర్‌ అరెస్టు కావడం ఖాయం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈమేరకు ఏసీబీ చర్యలు చేపడుతోంది. మరోవైపు ఈడీ కూడా తమ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. దీంతో వ్యవహారం మరింత ముదిరే అవకాశం ఉంది. ఇది రూ.56 కోట్ల స్కామ్‌ కాదని, రూ.600 కోట్ల స్కామ్‌ అని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రకటించడం, అసెంబ్లీ వేదికగానే ఆరోపించడంతో కేటీఆర్‌కు ఉచ్చు బిగించాలన్న ఆలోచనలో రేవంత్‌ సర్కార్‌ ఉందన్నది స్పష్టమైంది. అయినా కేసీఆర్‌ నోరు మెదపడం లేదు.

    నాడు కూతురు విషయంలోనూ..
    ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ అరెస్టు చేసిన సమయంలో కూడా కేసీఆర్‌ స్పందించలేదు. మీడియా ముందు మాట్లాడలేదు. కనీసం ఖండించలేదు. లోక్‌సభ ఎన్నికల సమయంలో నేతలతో నిర్వహించిన మీటింగ్‌లో మాత్రమే కడుపు తరుక్కుపోతుందని అన్నారు. తాజాగా కేటీఆర్‌ వ్యవహారంలోనూ అలాగే ఉన్నారు. తండ్రే స్పందించకపోతే పరిస్థితి ఏంటి అని గులాబీ నేతలు గుసగుసలాడుతున్నారు.

    కాంగ్రెస్‌కు ప్లస్‌..
    కేసీఆర్‌ మౌనం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్లస్‌ పాయింట్‌ అవుతోంది. ఆయన అసెంబ్లీకి రాకపోవడం, ప్రజల సమస్యలపై స్పందించకపోవడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టకపోవడం ఇలా అన్నీ రేవంత్‌ సర్కార్‌కు కలిసి వస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మాత్రం కేసీఆర్‌ తాగి ఫాంహౌస్‌లో పడుకుంటున్నారని విమర్శిస్తున్నారు. కేసీఆర్‌ తీరే ఈ విమర్శలకు కారణం.