Heroes : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకొవడం లో ముందు వరుసలో ఉంటున్నారు. ఇక ఇప్పటివరకు అందుకున్న విజయాలు చాలా ఉత్తమమైనవనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే పెద్ద హీరోల సినిమాలకు మాత్రమే రిలీజ్ సమయంలో ప్రీమియర్ షో ని వేస్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే పెద్ద సినిమాల హీరోలకు మొదటి రోజు కలెక్షన్స్ ని ఎక్కువగా చూపించుకోవడానికి ప్రీమియర్ షోస్ అనేవి చాలా వరకు హెల్ప్ అవుతాయి. అలాగే రిలీజ్ కి ముందే ప్రీమియర్ షోస్ పడడం వల్ల ఆ హీరోల ఫ్యాన్స్ ఆనందపడతారు. అలాగే సినిమాని ఎక్కువగా ప్రమోట్ చేస్తారనే ఉద్దేశ్యంతోనే ఇలాంటి ఒక కార్యచరణకి శ్రీకరమైతే చుట్టారు. అయితే ప్రీమియర్ షోస్ పడడం వల్ల యావత్ సినిమా ఇండస్ట్రీకి సినిమా రిలీజ్ కి ముందే సినిమా ఎలా ఉంది అనే ఒక టాక్ అయితే స్ప్రెడ్ అవుతుంది. ఇక దాని ద్వారా సినిమా చూడాలి అనుకునే వారికి కూడా ఇది చాలావరకు హెల్ప్ అవుతుందనే చెప్పాలి. మరి మొత్తానికైతే ఇప్పుడు ప్రీమియర్ షోస్ కి తెలంగాణ రాష్ట్రంలో అవకాశం లేదు అంటూ ప్రభుత్వమైతే తెలియజేసింది.
దానికి కారణం ఏంటి అంటే పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోలో సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట లో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. తద్వారా ఇకమీదట నుంచి ప్రీమియర్ షోస్ కి అనుమతి లేదు అంటూ తెలంగాణ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది.
మరి దానికి తగ్గట్టుగానే ఇప్పుడు రాబోయే సినిమాలకి ప్రీమియర్ షోస్ కి అనుమతి అయితే లేదు. మరి దీన్ని బట్టి చూస్తే డైరెక్ట్ గా రిలీజ్ రోజే సినిమాలను చూడాల్సిన అవసరమైతే ఏర్పడింది. ఇక ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు ప్రీమియర్ షోస్ కి దూరం అవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది.
ఇక దానికి తగ్గట్టుగానే వాళ్ళ అభిమానులు కూడా ప్రీమియర్ షోస్ చూడాలనుకునే వారికి కొంతవరకు ఇబ్బందులైతే ఎదురయ్యే పరిస్థితి అయితే ఉంది. ఇక డైరెక్ట్ గా ఫ్యాన్స్ కూడా మొదటి రోజు సినిమా రిలీజ్ అయిన తర్వాతే ఆడియన్స్ తో కలిసి వాళ్ళ అభిమాన హీరో సినిమాలను చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది…