HomeతెలంగాణKCR attends assembly: అంటే అన్నారంటారు గానీ.. ఇంతదానికి అసెంబ్లీకి ఎందుకు కేసీఆర్ సార్?

KCR attends assembly: అంటే అన్నారంటారు గానీ.. ఇంతదానికి అసెంబ్లీకి ఎందుకు కేసీఆర్ సార్?

KCR attends assembly: తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు సోమవారం(డిసెంబర్‌ 29న) ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్‌ఎస్‌ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరయ్యారు. అయితే కేసీఆర్‌ హాజరుపై మూడు రోజులుగా మీడియాలో, సోషల్‌ మీడియాలో పెద్ద హైప్‌ తెచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిదీస్తారని, కృష్ణా, గోదావరి జలాల అంశాలపై చర్చలో పాల్గొటారని, రేవంత్‌ సర్కార్‌ను ఇరుకున పెడతారని కథనాలు రాశారు. కానీ, ఊరించి ఉసూరుమనిపించినట్లుగా కేసీఆర్‌ అసెంబ్లీకి ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయారు. దీంతో అంటే అన్నారంటారు గానీ.. ఇంతదానికి ఎందుకు వచ్చినట్లు అని అటు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఇటు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నిట్టూరుస్తున్నారు.

సంతాప తీర్మానం కాగానే.
ఉదయం 10 గంటలకు నంది నగర్‌లోని తన నివాసం నుంచి బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీకి బయల్దేరారు. యుద్ధానికి వెళ్తున్న వీరుడిలా కార్యకర్తలు దిష్టితీసి మరీ పంపించారు. కేసీఆర్‌ 10:15 గంటలకు అసెంబ్లీకి చేరుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో తన చాంబర్‌లో సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల ఎజెండా తెలుసుకున్నారు. సభలో చర్చించాల్సిన అంశాలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. సభ ప్రారంభం కాగానే లోపలికి వచ్చారు.

కరచాలనం చేసిన సీఎం, మంత్రులు..
రెండేళ్ల తర్వాత మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టిన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ వద్దకు సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా వెళ్లారు. నమస్కారం చేసి, ఆరోగ్య గురించి అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట వెళ్లిన మంత్రులు కూడా కేసీఆర్‌తో కరచాలనం చేశారు. దీంతో కేసీఆర్‌ ఈ సమావేశాల్లో పూర్తిస్థాయిలో పాల్గొంటారని అంతా భావించారు. సభ ప్రారంభం కాగానే జాతీయ గీతం ఆలపించారు. తర్వాత స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ సంతీప తీర్మాణాలు ప్రవేశపెట్టారు.

సడెన్‌ ఎగ్జిట్‌..
కేసీఆర్‌ సభలో ఉంటారని, చర్చల్లో పాల్గొంటారని అందరూ భావిస్తుండగా, ప్రతిపక్ష నేత సడెన్‌గా అసెంబ్లీ నుంచి వెళ్లిపోయి ట్విస్ట్‌ ఇచ్చారు. సీఎం రేవంత్‌వెళ్లి కచరాలనం చేసి మాట్లాడినంత సేపు కూడా కేసీఆర్‌ అసెంబ్లీ హాల్‌లో లేరు. ఇలా వచ్చి.. జాతీయ గీతాలాపన, సంతాప తీర్మానాల అనంతరం సభ నుంచి వెళ్లిపోయారు. మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా వెళ్లారు.

నేతల భాషపై బీజేపీ ఎమ్మెల్యే అభ్యంతరం..
సంతాప తీర్మానాలు పూర్తయిన తర్వాత జీరో అవర్‌లో బీజేపీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సభలో ఉపయోగించే మాటల శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌ నుంచి ప్రస్తుత సీఎం రేవంత్‌ రెడ్డి వరకు అందరూ గౌరవప్రదమైన భాష ఉపయోగించాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు సభలో చర్చనీయాంశమయ్యాయి.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఆరోపణలు..
జీరో అవర్‌లోనే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌసిక్‌ రెడ్డి మేడిగడ్డ పేలుళ్లు, తన నియోజకవర్గంలో ఇటీవలి చెక్‌డ్యామ్‌ పేలుళ్లను ప్రస్తావించారు. ఈ విషయాలపై అధికార పార్టీ నాయకులు తక్షణమే అసంతప్తి చెప్పి, ఆ ప్రస్తావనలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. సభలో ఈ వివాదం మరింత ఉద్రిక్తతకు దారితీసింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version