Swetcha Votarkar Case: పాత్రికేయురాలు స్వేచ్ఛ మరణానికి సంబంధించిన కేసులో రకరకాల విషయాలు వెలుగుచూస్తున్నాయి. స్వేచ్ఛ మరణానికి సంబంధించి ఆమె కూతురు అరణ్య, తండ్రి శంకర్ ఇప్పటికే సంచలన విషయాలు వెల్లడించారు. స్వేచ్ఛ తల్లి శ్రీదేవి కూడా గతంలో తమ కుటుంబంలో చోటు చేసుకున్న విషయాలను కూడా ప్రకటించారు. అవన్నీ కూడా స్వేచ్ఛకు అనుకూలంగా, పూర్ణకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇవి జరుగుతుండగానే పూర్ణ భార్య స్వప్న ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ఆమె కూడా కీలక విషయాలు వెల్లడించారు. స్వప్న వెల్లడించిన విషయాలలో పూర్ణ బాధితుడిగా కనిపిస్తున్నాడు. అరణ్య, శంకర్, శ్రీదేవి, స్వప్న.. ఈ నలుగురు కాకుండా స్వేచ్ఛ అంతరంగిక విషయాలు తెలిసినవారు కొందరు ఉన్నారు. అయితే వారు చెబుతున్న విషయాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
Also Read: చిరంజీవి సపోర్ట్ వల్లే ఆ నటుడు స్టార్ హీరోగా ఎదిగాడా..?
స్వేచ్ఛను పెళ్లి చేసుకుంటానని పూర్ణ మాట ఇచ్చాడట. అంతేకాదు ఆమె మీద ఒత్తిడి తీసుకొచ్చి భర్త నుంచి విడాకులు తీసుకునే విధంగా చేశాడట. అతడిని నమ్మిన స్వేచ్ఛ అదేవిధంగా విడాకులు ఇచ్చిందట. విడాకులు ఇచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ప్రతిపాదన తీసుకొస్తే పూర్ణ దాటవేసేవాడట. ఇక ఇటీవల కూడా ఆమె అదే ప్రస్తావన తీసుకొస్తే పెళ్లి చేసుకునేది లేదని స్పష్టంగా చెప్పాడట. తనకు పొలిటికల్ గా సపోర్టు ఉందని.. ఆర్థికంగా తాను బలవంతుడిని చెప్పి స్వేచ్ఛను బెదిరించాడట. దీంతో మనస్థాపానికి గురైన స్వేచ్ఛ ఆత్మహత్యకు పాల్పడిందని తెలుస్తోంది.
ఇక పోలీసుల విచారణలో పూర్ణ కీలక విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. పూర్ణ ప్రస్తుతం రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ దగ్గర చేస్తున్నట్టు వెల్లడించాడు. స్వేచ్ఛతో తనకు ఉన్న బంధం గురించి సంతోష్ కుమార్ కు తెలుసని, మిగతా రాజకీయ నాయకులకు కూడా తెలుసని పూర్ణ చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు పూర్ణచందర్ గడిచిన 15 సంవత్సరాలుగా స్వేచ్ఛతో కలిసి ఉంటున్నాడని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతోనే స్వేచ్ఛ తన భర్తకు విడాకులు ఇచ్చిందని సమాచారం. ఆ తర్వాత పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చిన ప్రతి సందర్భంలోనూ పూర్ణ దాటవేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు మధ్య విభేదాలు ఏర్పడ్డాయని.. పెళ్లి చేసుకోకుండా తనను సంవత్సరాలకు సంవత్సరాలుగా మోసం చేస్తూ వస్తున్న నేపథ్యంలో స్వేచ్ఛ తీవ్రమైన మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.. మరోవైపు స్వేచ్ఛ కూతురు అరణ్యను కూడా పూర్ణ వేధించినట్టు మీడియాలో వార్తలు రావడంతో.. పోలీసులు స్వేచ్ఛ కోతులు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు.
సరిగ్గా 11 రోజుల క్రితం స్వేచ్ఛ, పూర్ణ అరుణాచలం వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి వస్తుండగా స్వేచ్ఛ మరోసారి అతని ఎదుట పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. దీంతో పూర్ణ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. అంతేకాదు తన రాజకీయ పలుకుబడి.. ఆర్థికంగా ఉన్న అండదండల వల్ల నన్ను ఏమీ చేయలేవని పూర్ణ స్వేచ్ఛను బెదిరించినట్టు తెలుస్తోంది. దీంతో తనని పెళ్లి చేసుకునే ఉద్దేశం పూర్ణకు లేదని భావించిన స్వేచ్ఛ తీవ్రమైన మనోవేదనకు గురయింది. ఆ తర్వాత మూడు రోజులకే ఆమె తీవ్రమైన ఘాతుకానికి పాల్పడింది. మరోవైపు గడచిన ఎన్నికల్లో పూర్ణచందర్ ఆదిలాబాద్ జిల్లాలోని ఓ నియోజకవర్గం టిక్కెట్ ఆశించినట్టు తెలుస్తోంది.