CM Revanth Reddy: తెలుగు రాష్ట్రాల్లో( Telugu States ) రెండు పార్టీలు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయి. ఏపీలో జగన్ పార్టీ.. తెలంగాణలో కెసిఆర్ పార్టీ దారుణ ఓటమితో ఇబ్బందులు పడుతున్నాయి. అయితే రెండు కుటుంబ పార్టీలే. ఉవ్వెత్తిన ఎగసిపడేవే. అదే స్థాయిలో పాతాళానికి పడ్డాయి. దానిని తప్పు పట్టలేము కానీ.. ఆ రెండు పార్టీలు ఇప్పుడు కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి. ఏపీలో జగన్మోహన్ రెడ్డి మాదిరిగా.. తెలంగాణలో కేటీఆర్ సైతం సొంత సోదరి నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆ ఇద్దరు కూడా వ్యక్తిగత వైఖరితోనే రాజకీయంగా విభేదించడం విశేషం. ఇప్పుడు అదే విషయాన్ని చెప్పుకొచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.
* వ్యక్తిగత విభేదాలతో రాజకీయ వైరం..
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని( AP CM Jagan Mohan Reddy ) ఎప్పటినుంచో విభేదిస్తున్నారు సోదరి షర్మిల. జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఉన్నతికి షర్మిల పాటు పడ్డారు. అయితే వారి తండ్రి రాజశేఖరరెడ్డి దాదాపు 6 సంవత్సరాల పాటు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేవారు. 1978 నుంచి ఆ కుటుంబం రాజకీయాల్లో ఉంది. రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా, ఎంపీగా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఇలా ఎన్నో రకాల పదవులు నిర్వర్తించారు. రాజకీయాల్లో ఉన్నప్పుడే ఎన్నో రకాల వ్యాపారాలు చేశారు. అయితే తండ్రి అకాల మరణంతో జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిల విషయంలో జగన్ వైఖరి మారింది. ముఖ్యంగా తండ్రి ఆస్తుల విషయంలో ఇద్దరి మధ్య వైరం ముదిరి.. రాజకీయంగా, వ్యక్తిగతంగా విభేదించే స్థాయికి వచ్చింది.
* సంచలన కామెంట్స్
అయితే తెలంగాణలో సైతం కెసిఆర్( KCR) కుటుంబంలో అదే తరహా పరిస్థితి బయటపడింది. కెసిఆర్ కుమార్తె కవిత తన అన్న కేటీఆర్ ను విభేదించడం ప్రారంభించారు. అది కూడా ఆర్థిక వ్యక్తిగత వ్యవహారాలతో అని ప్రచారం నడుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో దానినే హైలెట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంటి ఆడపిల్లను న్యాయం చేయలేడు.. ఈ రాష్ట్రంలోని మహిళలకు ఎలా న్యాయం చేస్తాడని కేటీఆర్ ను ఉద్దేశించి అన్నాడు. అంతటితో ఆగకుండా కెసిఆర్ సంపాదించిన అవినీతి సొమ్ములో పది పైసల వాటా కూడా ఇచ్చేందుకు అంగీకరించలేదని.. అందుకే కవిత రాజకీయంగా విభేదిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు రేవంత్. అంతటితో ఆగకుండా తల్లికి అన్నం పెట్టలేదు కానీ.. పిన్నమ్మకు గాజులు కొనిపెట్టిస్తాడట అంటూ సెటైర్లు వేశారు. అయితే తెలంగాణలో వేసిన ఆ సెటైర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తాకింది. ఏపీలో జగన్మోహన్ రెడ్డి పై రేవంత్ పరోక్ష ఆరోపణలు చేశారని సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభం అయింది.
ఆస్తుల వాటా విషయంలో సొంత చెల్లిని మెడలు పట్టి బయటకు గెంటిన కసాయోడు, నీచుడు కేటీఆర్. ఈయన ఆడబిడ్డకు న్యాయం చేస్తాడు అంట! సొంత చెల్లె ఆదిలాబాద్ నుండి ఆలంపూర్ వరకు తిరిగి కేటీఆర్ ను బొంద పెట్టండి అని తిరుగుతుంది.
శ్రీ రేవంత్ రెడ్డి గారు – గౌరవ ముఖ్యమంత్రివర్యులు@revanth_anumula pic.twitter.com/EXZx6ZFgrT
— Telangana Congress (@INCTelangana) November 4, 2025