TV5 Murthy: తెలుగులో డేరింగ్ డాషింగ్ పాత్రికేయులలో మూర్తి ఒకరు. ఈయన ప్రస్థానం అనేక చానల్స్ లో సాగింది. ప్రస్తుతం టీవీ5 లో ఉన్నతమైన స్థానంలో కొనసాగుతున్నారు. సోషల్ మీడియాలో మూర్తి యాక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా ఏదైనా సమస్యల విషయంలో తీవ్రంగా స్పందిస్తారు. ఆ సమయంలో తాను ఒక జర్నలిస్టు అనే విషయాన్ని కూడా మర్చిపోయి కామన్ మ్యాన్ గా ప్రవర్తిస్తుంటారు. అదే స్థాయిలో ఆగ్రహాన్ని.. వివేకాన్ని కనబరుస్తుంటారు. అందువల్లే ఆయనను చాలామంది ఇష్టపడుతుంటారు.
ఆ మధ్య వేణు స్వామి వివాదంలో మూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. వేణు స్వామి వ్యవహారంలో సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఏకంగా వేణు స్వామి అసలు లీలలను బయటపెట్టారు. ఆ తర్వాత వేణు స్వామి ఏకంగా జ్యోతిష్యం చెప్పడం మానేశారు. అందరికి క్షమాపణలు కూడా చెప్పారు.. టీవీ5 మూర్తితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో వేణు స్వామికి ఆ పరిణామంతో దెబ్బకు అర్థమైంది. టీవీ ఫైవ్ మూర్తి నాడు నిర్వహించిన డిబేట్లలో వేణు స్వామి బాధితులు చాలామంది లైవ్ లోకి వచ్చారు. తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఇబ్బందులు చాలా పెట్టారని.. మీ ద్వారా ఇన్నాళ్లకు వేణు స్వామి అసలు బాగోతం బయటపడిందని టీవీ5 లైవ్ డిబేట్లలో వెల్లడించారు.
టీవీ5 మూర్తికి సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటాయి. అందులో ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా కనిపిస్తోంది. ఆ వీడియోలో కనిపించిన దృశ్యాల ప్రకారం.. మూర్తి ప్లేట్ లో సలాడ్స్ తింటూ ఉన్నారు. ఆయనను ఓ వ్యక్తి ప్రశ్నించారు. “సార్ మీరు రైస్ తినరా.. కేవలం ఇవి మాత్రమే తింటారా” అని ప్రశ్నించారు..” నేను రైస్ తినను. సిగరెట్ తాగను. మద్యం ముట్టను. కేవలం సలాడ్స్ మాత్రమే తింటాను. ఈ ప్లేట్లోనే తింటాను. ప్లేట్ ఫిరాయించను” అని మూర్తి బదులిచ్చారు. ప్లేట్ ఫిరాయించను అనే మాటను వైసీపీ శ్రేణులు తెగ ట్రోల్ చేస్తున్నాయి. ఈ మాట ఆయన సపోర్ట్ చేసే పార్టీ నేతలకు వర్తిస్తుందని వ్యాఖ్యానిస్తున్నాయి.
ప్లేట్, ఇల్లు, డైనింగ్ టేబుల్, ఫుడ్ ఎవ్వరిది అని మాత్రం అడగకండి… చచ్చినోడా… సంసారాలు కూల్చే వెదవ pic.twitter.com/tgyovON0Nz
— Anitha Reddy (@Anithareddyatp) September 27, 2025