Kavitha at KCR farmhouse: కుటుంబ పార్టీలలో అన్ని అనుకూలంగా ఉన్నంతవరకు ఎటువంటి లోపాలు బయటపడవు. కానీ ఒక్కసారిగా విభేదాలు మొదలయ్యాయి అంటే ప్రతి అంశం లోను తేడాలు కనిపిస్తూనే ఉంటాయి. తమిళనాడులో డీఎంకే, ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు తెలుగుదేశం, ఇటీవల వైఎస్ఆర్సిపి.. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిలో కల్వకుంట కవితకు, కల్వకుంట్ల తారక రామారావుకు, తన్నీరు హరీష్ రావుకు, జోగినపల్లి సంతోష్ రావుకు సయోధ్య వున్నప్పుడు వాతావరణం మొత్తం సానుకూలంగా ఉండేది. కానీ ఎప్పుడైతే వీరి మధ్య విభేదాలు మొదలయ్యాయో.. ఆ తర్వాత ప్రతిరోజు మీడియాలో సంచలనమే.
కల్వకుంట్ల కవిత రెండవ కుమారుడు గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్ళాడు. దానికంటే ముందు తన కుమారుడిని తీసుకొని కల్వకుంట్ల కవిత తన తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆశీర్వాదం ఇప్పించడానికి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. పడకగదిలో ఉన్న కేసీఆర్ దగ్గరికి కవిత కుమారుడిని శోభమ్మ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కెసిఆర్ అతనికి ఆశీర్వాదం ఇవ్వడంతో పాటు.. కుశల ప్రశ్నలు అడిగారు. ఇంతవరకు మీడియాలో ఉదయం నుంచి చర్చ నడుస్తోంది. వ్యవసాయ క్షేత్రానికి స్వయంగా కవిత వెళ్లినప్పటికీ కేసీఆర్ ఆమెతో మాట్లాడేందుకు సుముఖత వ్యక్తం చేయలేదని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ.. కవిత కలిసిన వ్యవహారాన్ని నమస్తే తెలంగాణ ప్రచురించకపోవడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read: ఎర్రవల్లి ద్వారాలు తెరుచుకున్నా.. డాడీ మాట కరువైంది.. పాపం కవిత!
అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్న వార్త ఏందయ్యా అంటే.. కల్వకుంట్ల కవిత తన తండ్రిని కలవడానికి వెళ్ళినప్పుడు అదే సమయానికి కల్వకుంట్ల తారకరామారావు, తన్నీరు హరీష్ రావు వెళ్లినట్టు తెలుస్తోంది. పైగా కవితతో వారిద్దరు మాట్లాడనట్టు సమాచారం. ఎడముఖం పెడ ముఖం మాదిరిగానే వారి ముగ్గురు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆర్యను కేసీఆర్ ఆశీర్వదిస్తున్నప్పుడు కవిత ప్రధాన ద్వారం వరకే పరిమితమయ్యారని సమాచారం.. కవితతో హరీష్ రావు, తారక రామారావు మాట్లాడకపోవడం పట్ల మీడియాలో రకరకాల విశ్లేషణలు వెలుగులోకి వస్తున్నాయి. కవిత భారత రాష్ట్ర సమితిలోకి పునరాగమనం చేయడానికి వారిద్దరే అడ్డుపడుతున్నట్టు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మరి దీనిపై వచ్చే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.