Blue screen for SSMB 29: తెలుగు సినిమా ఇండస్ట్రీని అమాంతం తారాస్థాయికి తీసుకెళ్లిన దర్శకులలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడు. ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపుని సంపాదించి పెట్టడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అతన్ని టాప్ డైరెక్టర్ ను చేశాయి. ప్రస్తుతం ఉన్న దర్శకులందరిలో తను నెంబర్ వన్ డైరెక్టర్ గా ఉండడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం తనవైపు తిప్పుకునేలా చేశాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసిన రాజమౌళి తొందర్లోనే మూడో షెడ్యూల్ ని కూడా స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఈ సినిమాని మొదట కెన్యా అడవుల్లో చిత్రీకరించాలని ప్రణాళికలు రూపొందించుకుంటున్నప్పటికి దానికి వీలుపడకపోవడంతో ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీ అయిన ‘టాంజానియా’ లో షూట్ చేసి ఆ మొత్తాన్ని ఆఫ్రికన్ అడవులుగా చిత్రీకరించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
అయితే దీనికోసం ఆయన బ్లూ స్క్రీన్ టెక్నాలజీని వాడుతున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి బ్లూ స్క్రీన్ టెక్నాలజీ అంటే ఏంటి అంటే సినిమా మొత్తాన్ని బ్లూ స్క్రీన్ లో చిత్రీకరించి దాన్ని ఒరిజినల్ గా ఏ లొకేషన్ లో అయితే తీయాలనుకున్నారో ఆ లొకేషన్ ని సెట్ చేస్తారు. దానివల్ల సినిమాకు గ్రాఫిక్స్ చేశారనే విషయం ఎవరు కనిపెట్టలేనంత ఒరిజినల్ గా ఉంటుంది.
Also Read: ఎన్టీఆర్ తన టీమ్ తో చర్చలు జరుపుతున్నాడా..? ఇదంతా వార్ 2 ఎఫెక్టేనా..?
అందువల్ల బ్లూ స్క్రీన్ టెక్నాలజీని చాలామంది వాడుతూ ఉంటారు. ఇక రాజమౌళి దీన్ని పర్ఫెక్ట్ గా డెలివరీ చేసి ప్రేక్షకుల ముందు ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలో రాజమౌళి చేస్తున్న ఈ సినిమా అతని ఇమేజ్ ను తార స్థాయికి పెంచుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి బ్లూ స్క్రీన్ టెక్నాలజీలో తను అడ్వాన్స్డ్ ఫీచర్స్ ని వాడుతూ రాజమౌళి ఆఫ్రికన్ అడవుల్ని క్రియేట్ చేయాలని చూస్తున్నాడట.
ఇక దాంతో పాటుగా కొన్ని అడ్వెంచర్స్ కి సంబంధించిన సన్నివేశాలు కూడా ఉన్నాయట. వాటన్నింటిని అందులోనే చిత్రీకరించి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ రేంజ్ లో సూపర్ సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…