Noah Schnapp: సమాజం ఎంత అభివృద్ధి చెందినా కొన్ని విషయాలు తీసుకోవడం కష్టమే.. మగ, ఆడ జాతులకు ఉన్న విలువ థర్డ్ జెండర్ కి ఉండదన్నట్టే భావిస్తారు. సమాజం వాళ్ళను చిన్న చూపుతో చూస్తారు. అందుకే చాలా మంది తాము థర్డ్ జెండర్ అనే విషయాన్ని వెల్లడించరు. ‘గే’ పరిస్థితి కూడా అదే. కొందరు మేల్ హోమో సెక్సువల్స్ ఉంటారు. ఇవి అసహజమైన కోరికలు. కానీ నేటికి సమాజం అంగీకరించని విషయాలుగానే ఉండిపోయాయి. మిత్రులు, కుటుంబ సభ్యులు, తోటి వారు స్వలింగ సంపర్కాన్ని తప్పుగా చూస్తారు కాబట్టి.. తాము గే అని ఎవరూ బయటకు చెప్పరు. రహస్యంగా తమ వర్గం వారిని కలుసుకొని కోరికలు తీర్చుకుంటారు. తాజాగా హాలీవుడ్ నటుడు నోవా షన్నాప్ తాను గే అంటూ తెలుస్తోంది. ఇందులో వాస్తవమెంత అనే వివరాలు ఈ ఆర్టికల్ లో చూద్దాం….
అయితే ఈ విషయాన్ని స్వయంగా నోవా షన్నాస్ బహిరంగ ప్రకటన చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు కూడా. ఓటీటీ కల్చర్ పెరిగిపోయిన తర్వాత వెబ్ సిరీస్ లు చూడటం బాగా అలవాటైపోయింది. అందులో భాగంగానే నెట్ ఫ్లిక్స్ లో మూడు సీజన్లు ఉన్న ‘స్ట్రేంజర్ థింగ్స్’ సిరీస్.. పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ల వరకు ఆకట్టుకుంది. ఎలెవన్, మైక్ తో కలిసి పిల్లల గ్యాంగ్ అంతా చేసే అడ్వెంచర్స్.. ఈ సిరీస్ ని సూపర్ హిట్ చేశాయి. ఇక గతేడాది మూడో సీజన్ రిలీజైంది. అందులో విల్ బయర్స్ రోల్ లో యాక్ట్ చేసిన నోవా షన్నాప్.. స్వలింగ సంపర్కుడు పాత్రలో యాక్ట్ చేశాడు. తీరా ఇప్పుడు తాను నిజంగానే గే అని అందరికీ షాకిచ్చాడు.పద్దెనిమిదేళ్లపాటు భయపడుతూ బతికిన నేను ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకున్నాను. నేను గే అని నా ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కు చెప్పేశాను. కానీ వాళ్లు మాకు తెలుసంటూ ఓ టిక్‌టాక్ వీడియో చేశాడు.
అక్కడితో ఆగకుండా ‘నేను రియల్‌లైఫ్‌లో కూడా విల్ బయర్స్‌నే’ అంటూ తాను స్వలింగ సంపర్కుడినని నొక్కి చెప్పాడు. అప్పట్లో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు ఆ సిరీస్ చేసినప్పుడే మేము గెస్ చేయాల్సింది అని కామెంట్లు కూడా చేశారు. అయితే నోవా తాను గే అంటూ చేసిన ప్రకటన అభిమానులను షాక్ కి గురిచేసింది. వారు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ విషయం వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే మెజారిటీ వర్గాలు… దాన్ని అంగీకరించి ఆయనకు మద్దతుగా నిలిచారు.
న్యూయార్క్ లో పుట్టిన నోరా ప్రస్తుత వయసు 18 ఏళ్ళు. 2015లో విడుదలైన బ్రిడ్జి ఆఫ్ స్పైస్ మూవీతో నటుడిగా మారాడు. ఆ మూవీ ఆస్కార్ వేదికపై మెరిసింది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయినా స్ట్రేంజర్ థింగ్స్ సిరీస్ తో నోవా ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఆయన ది ట్యూటర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. దాదాపు 10 హాలీవుడ్ చిత్రాల్లో నోవా నటించారు.
సాధారణంగా నటీనటులు కొన్ని పర్సనల్ విషయాల్ని పెద్దగా రివీల్ చేయరు. రిలేషన్ షిప్, విడాకులు లాంటి వాటి గురించి అయితే ఎవరైనా ఏదన్నా క్వశ్చన్ చేసినా సరే దాని గురించి పెద్దగా పట్టించుకోరు. ఇదంతా ఒకప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం యాక్టర్స్, కొన్నిసార్లు ధైర్యంగా బయటకు చెబుతున్నారు. కానీ ఇప్పుడు నటుడు నోవా విషయం చెప్పేసరికి అంత షాక్ అయ్యారు. కానీ నిజం దాచేకంటే చెప్పేసి సంతోషంగా ఉండడం ఉత్తమం అని ఆయన అభిమానులు కూడా పెద్దగా ఆ విషయాన్ని పట్టించుకోలేదు.