Konda Surekha Issue : కొండా సురేఖ సంఘటన వల్ల సెలబ్రిటీలు తెలుకోవాల్సింది ఏంటంటే..?

సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి తమదైన రీతిలో మంచి గుర్తింపైతే ఉంటుంది. మరి మొత్తానికైతే ఇలాంటి సమయం లోనే వాళ్ళు చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధిస్తాయి. ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు స్టార్ హీరోలుగా ముందుకు కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే సినిమా ఇండస్ట్రీ మీద ప్రతి ఒక్కరూ కామెంట్లు చేస్తూ ఉంటారు.సినిమా వాళ్ళను చాలా చులకనగా చూస్తూ ఉంటారు...

Written By: Gopi, Updated On : October 3, 2024 8:33 pm

Konda Surekha issue

Follow us on

Konda Surekha Issue : రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు ఎవరైనా సరే వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉండి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే పర్లేదు కానీ అలా కాకుండా తమకు ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది మాట్లాడుతూ ఎవరిని పడితే వాళ్ళని దూషిస్తుంటే మాత్రం వాళ్లు సంపాదించుకున్న క్రేజ్ మొత్తం ఒక్క రోజులో ఒక్క మాటతో సమాప్తం అయిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక రీసెంట్ గా కొండా సురేఖ సంఘటన దానికి ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. ఆమె కేటీఆర్ ను దూషించాలనే ఉద్దేశ్యంతో హీరోయిన్ సమంత, నాగార్జున లను ఉద్దేశిస్తూ చాలా మాటలు మాట్లాడింది. దాంతో ఒక్కసారిగా ఆమె మీద వ్యతిరేకత అయితే పెరిగింది. నిజానికి ఈ సంఘటన జరగడానికి ముందు బిఆర్ఎస్ సోషల్ మీడియాలో ఆమె మీద చేస్తున్న అక్రమమైన ఆరోపణలకు తన మీద సింపతీ అయితే పెరిగింది. అయితే ఆమె ఆ ఆరోపణలను తనకు అనుకూలంగా మార్చుకోకుండా కేటీఆర్ ని దూషించాలనే ఉద్దేశ్యంతో సమంత, అక్కినేని ఫ్యామిలీ మీద ఆరోపణలు చేసింది. దాంతో ఒక్కసారిగా ఆమె మీద సినీ సెలబ్రిటీలందరూ విరుచుకుపడుతున్నారు.

ఇక ప్రస్తుతం ఆమె బయటకు వచ్చి సారీ చెప్పినా కూడా ఈ సంఘటన అయితే అంత ఈజీగా సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఎందుకంటే సినీ సెలబ్రిటీల మీద వ్యంగం గా మాట్లాడడం పంచులు వేయడం కామెంట్స్ చేయడం రాజకీయ నాయకులకు అలవాటైపోయింది.

ఇక ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి. అంటే కొండా సురేఖ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలని సినీ ప్రముఖులు సైతం ఆమెను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఒక మంత్రి హోదాలో ఉండి ఆమె ఇలా మాట్లాడటం సరికాదనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా ఎన్నో సంవత్సరాలుగా రాజకీయంగా ఎదగాలనే ప్రయత్నం చేస్తూ వస్తున్న ఆమె ఎట్టకేలకు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని దక్కించుకున్న తరుణంలో ఇలాంటి ఒక చిన్న పొరపాటు మాట వల్ల ఆమె ఎంటైర్ రాజకీయ జీవితానికే ఇబ్బంది కలిగే పరిస్థితి అయితే ఎదురైంది.

అందుకే అధికారం చేతిలో ఉందని ఆలోచించకుండా మాట్లాడటాలు చేస్తే ఇలాంటి సంఘటనలే ఎదురవుతాయని చెప్పడానికి సురేఖని ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. ఇక మొత్తానికైతే కొండ సురేఖ సంఘటన ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం నేర్పిస్తుందనే చెప్పాలి…