KTR: పార్లమెంటు ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం రంజుగా మారుతోంది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. మరోవైపు కాంగ్రెస్ గేట్లు ఎత్తడంతో బీఆర్‌ఎస్ నేతలు హస్తం వైపు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా సీనియర్ నాయకులు కే.కేశవరావు, కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య కూడా బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పారు. ఇలా బీఆర్‌ఎస్ నుంచి ఒకవైపు వలసలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహరాం బీఆర్‌ఎస్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఈ కే సు కూడా సినిమా ట్విస్టులను తలపించేలా రోజుకో మలుపు తిరుగుతోంది. పోలీస్ అధికారులు వరుసగా అరెస్ట్ అవుతున్నారు. బీఆర్‌ఎస్ నేతల పేర్లు చెప్పే వరకు విచారణ కొనసాగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కేటీఆర్ మేకపోతు గాంభీర్యం..
ఒకవైపు గులాబీ నేతలు వరుసగా పార్టీ వీడుతున్నారు.. మరోవైపు కేసీఆర్ తనయ, కేటీఆర్ సోదరి కవిత ఇప్పటికే లిక్కర్ కేసులో అరెస్టు అయ్యారు. ఇంకోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసీఆర్, కేటీఆర్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. అయినా కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తం పేరుతో పార్టీ పార్లమెంటు స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లోనూ కాంగ్రెస్‌పై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ను ఇరకాటంలోకి నెడుతున్నారు.
ఫోన్ ట్యాపింగ్‌పై అంగీకారం..
ఇటీవల మల్కాజ్‌గిరి నియోజకవర్గస్థాయి సమావేశంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. డైలాగులు చెప్పడం తప్ప విషయానికి వస్తే పారీపోయే పరికి సీఎం రేవంత్‌రెడ్డి అని ఆరోపించారు. ఇక ఫో¯Œ ట్యాపింగ్ పేరుతో ప్రజలను డైవర్ట్ చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ‘దొంగలవి, లంగలవి, లుచ్చాగాళ్ల ఫోన్లు ట్యాప్ చేసి ఉండవచ్చు.. లక్షల ఫోన్లు ట్యాప్ చేశారని ప్రచారం చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. పరోక్షంగా ఫోన్ ట్యాపింగ్ అయినట్లు అంగీకరించారు. అయితే అది పోలీసుల పని అన్నారు.
పెరుగుతున్న ఫిర్యాదలు..
మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు డీజీపీని కలిసి తమ ఫోన్లు ట్యాప్ అయినట్లు ఫిర్యాదు చేశారు. ఇందులో కేసీఆర్, కేటీఆర్‌ను ముద్దాయిలుగా పేర్కొన్నారు. తాజాగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలకంగా ఉన్న నందకుమార్ కూడా ఫోన్ ట్యాప్‌పై ఫిర్యాదు చేశాడు.
ఎంక్వయిరీ చేయండి.. అరెస్టు చేయండి..
మరోవైపు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. విచారణను తాము అడ్డుకోవడం లేదని, విచారణ జరిపి దోషులు ఉంటే అరెస్టు చేయండి అని సూచించారు. దీంతో ఒక్కసారిగా బీఆర్‌ఎస్ నేతలు ఉలిక్కిపడ్డారు. అరెస్టు చేయాల్సి వస్తే ముందుగా కేసీఆర్, కేటీఆర్‌నే అరెస్టు చేయాలి. వారి అనుమతి లేకుండా పోలీసులు ఫోన్ ట్యాప్ చేసి ఉండరన్న అభిప్రాయం ఉంది. ఇలాంటి పరిస్థితిలో అరెస్టు చేయండి అని కేటీఆర్ వ్యాఖ్యానించడం కలకలం రేపింది.
హరీష్, సంతోష్‌లను..
మాజీ మంత్రి హరీశ్‌రావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌రావులను ఉద్దేశించే కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాము సేఫ్‌గా ఉండాలని, పక్కవాళ్లను ఇరికించాలన్న భావనలో కేటీఆర్ ఉన్నట్లు గులాబీ భవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: What is the secret behind ktr comments
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com