https://oktelugu.com/

సీఎం కేసీఆర్ మనవడికి ఏమైంది?

తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు.. మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు ఆస్పత్రి పాలైనట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే అది నిజమా కాదా అన్నది మాత్రం నిర్ధారణ కాలేదు. Also Read: కట్‌ చేసిన జీతాలు నాలుగు వాయిదాల్లో చెల్లింపులు హిమాన్సు లావుగా, పెద్ద బాడీతో ఉంటాడు. ఉబకాయం ఉంటుంది. ఈ క్రమంలోనే ఆయన కాలికి గాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న హిమాన్షును బుధవారం రాత్రి సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో చేర్పించినట్టు సమాచారం. ఇంట్లో […]

Written By:
  • NARESH
  • , Updated On : October 1, 2020 / 10:22 AM IST
    Follow us on

    తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు.. మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు ఆస్పత్రి పాలైనట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే అది నిజమా కాదా అన్నది మాత్రం నిర్ధారణ కాలేదు.

    Also Read: కట్‌ చేసిన జీతాలు నాలుగు వాయిదాల్లో చెల్లింపులు

    హిమాన్సు లావుగా, పెద్ద బాడీతో ఉంటాడు. ఉబకాయం ఉంటుంది. ఈ క్రమంలోనే ఆయన కాలికి గాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న హిమాన్షును బుధవారం రాత్రి సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో చేర్పించినట్టు సమాచారం.

    ఇంట్లో ప్రమాదవశాత్తూ కాలు జారి కింద పడడంతో హిమాన్షుకు గాయమైనట్టు ప్రచారం సాగుతోంది. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి సిటీ స్కాన్ చేయించారని తెలిసింది. ఆ గాయంతో కనీసం నిలబడలేక బాధపడుతున్నట్టు తెలిసింది.

    Also Read: అన్ లాక్ 5.0లో పాఠశాలలు తెరుస్తారా…? విద్యార్థుల భవిష్యత్తేంటి..?

    వైద్యులు తీసిన స్కానింగ్ లో తుంటి భాగం, మోకాలికి తీవ్ర గాయం అయినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అధికారికంగా ఈ విషయంపై ఎవరూ స్పందించలేదు.