KCR Wife: మొన్నటిదాకా కెసిఆర్ ఆరోగ్యం బాగోలేదని రకరకాల వదంతులు వినిపించేవి. దీనికి తగ్గట్టుగానే కేసీఆర్ పెద్దగా ఎవరిని కలిసేవారు కాదు. అప్పుడప్పుడు యశోద లేదా ఏఐజి ఆసుపత్రులకు వెళ్లేవారు. వివిధ రకాల పరీక్షలు చేయించుకునేవారు. దీంతో కెసిఆర్ అనారోగ్యంతో బాధపడుతున్నారని అందరూ అనుకునేవారు. కొందరైతే రకరకాల విష ప్రచారాలు చేసేవారు. కానీ ఇప్పుడు కేసీఆర్ బాగానే ఉన్నారు. పైగా నిన్న జరిగిన దసరా పూజలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. తన వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటుచేసిన దసరా పూజలో కుమారుడు కేటీఆర్, కోడలు శైలిమ, మనవరాలు అలేఖ్యతో కలిసి పూజలు నిర్వహించారు.
కెసిఆర్ పూజ నిర్వహించినప్పుడు ఆయన పక్కన సతీమణి శోభమ్మ ఉంటారు. కెసిఆర్ వివిధ యాగాలు నిర్వహించినప్పుడు ఆయనకు ఎడమ భాగంలో కూర్చుంటారు. పైగా ధార్మిక కార్యక్రమాలు అంటే శోభమ్మకు చాలా ఇష్టం. దానాలు, ధర్మాలు కూడా విరివిగా చేస్తుంటారని ప్రచారంలో ఉంది. ఇటీవల వేములవాడ రాజన్న క్షేత్రాన్ని శోభమ్మ సందర్శించారు. రాజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. ఆ సమయంలో కొంతమంది మహిళలు శోభమ్మను పలకరించారు. కెసిఆర్ ప్రభుత్వంలో తాము అందుకున్న పథకాల గురించి వివరించారు.
అయితే ఇటీవల కల్వకుంట్ల కవితకు, కెసిఆర్ కుటుంబానికి గ్యాప్ వచ్చిన విషయం తెలిసిందే. కెసిఆర్ కవితతో మాట్లాడకపోయినప్పటికీ.. శోభమ్మ మాత్రం ఆమెతో మాట్లాడుతోంది. కవిత రెండవ కుమారుడు అమెరికా వెళుతుండగా.. కెసిఆర్ ఆశీస్సులు అందించేలా శోభమ్మ చొరవ తీసుకున్నారు.. కెసిఆర్ పడక గదిలోకి కవిత కుమారుడిని తీసుకెళ్లారు. కుటుంబానికి దూరమైన కవితను దగ్గర చేయడానికి శోభమ్మ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.. తాజాగా జరిగిన దసరా పూజల్లో కేసీఆర్ తో ఆమె లేరు. ఆమె కవిత దగ్గరికి వెళ్లినట్టు తెలుస్తోంది.
కవిత దగ్గరికి శోభమ్మ వెళ్లినట్టు ఎటువంటి ఫోటోలు బయటకు రాకపోయినప్పటికీ..నిన్న జరిగిన దసరా పూజల్లో ఆమె పాల్గొనక పోవడం వెనుక అసలు కారణం అదేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం జాగృతిని బలోపేతం చేసే దిశగా కవిత అడుగులు వేస్తున్నారు. శోభమ్మ మాత్రం కుటుంబాన్ని దగ్గర చేయడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంతైనా తల్లి మనసు అలానే ఉంటుంది కదా. పైగా అందరు కలిసి ఉంటేనే తల్లికి ఆనందం ఉంటుంది. ప్రస్తుతం శోభమ్మ కూడా అలాంటి ప్రయత్నాలనే చేస్తున్నారు. చిన్న చిన్న పొరపాట్ల వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన విభేదాలను రూపుమాపడానికి ఆమె అడుగులు వేస్తున్నారు.