https://oktelugu.com/

CM Revanth Reddy: విద్యావ్యవస్థ, ఉద్యోగాలు : కేసీఆర్‌ ది బెటరా? ఇప్పటి రేవంత్‌ ది మంచిదా?

కాంగ్రెస్‌ మేనిఫెస్టోకు ఆకర్షితులైన యువత, నిరుద్యోగులు, విద్యార్థులు కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో పట్టం కట్టారు. ప్రభుత్వం నాలుగు రోజుల క్రితం కొలువు దీరింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 10, 2023 / 12:42 PM IST

    CM Revanth Reddy

    Follow us on

    CM Revanth Reddy: తెలంగాణలో అధికారంలోకి వస్తే విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని, విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు ఇస్తామని, మండలానికో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు పెంచుతామని మేనిఫెస్టోలో పేర్కొంది. అదే విధంగా ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడంతోపాటు కాలేజీకి వెళ్లే విద్యార్థులకు విద్యా భరోసా కింద రూ.5 లక్షల గ్యారెంటీ కార్డు ఇస్తామని ప్రకటించింది. 18 ఏళ్లు దాటిన విద్యార్థికి స్కూటీ ఇస్తామని ప్రకటì ంచింది. నిరుద్యోగులకు యూత్‌ కమిషన్‌ ఏర్పాటు చేసిన రూ.10 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తామని ప్రకటిచింది. నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి ఇస్తామని హామీ ఇచ్చింది. అంగన్వాడీ టీచర్ల వేతనాలు రూ.18 వేలకు పెంచుతామని ప్రకటిచింది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలతోపాటు హామీలు అమలు చేస్తామని తెలిపింది.

    గెలిపించిన ఓటర్లు..
    కాంగ్రెస్‌ మేనిఫెస్టోకు ఆకర్షితులైన యువత, నిరుద్యోగులు, విద్యార్థులు కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో పట్టం కట్టారు. ప్రభుత్వం నాలుగు రోజుల క్రితం కొలువు దీరింది. సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణం చేశారు. 11 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. దీంతో రెండు గ్యారంటీలను శనివారం అమలు చేశారు. దీంతో ఇప్పుడు మేనిఫెస్టో అమలుపై కాంగ్రెస్‌ సర్కార్‌ దృష్టి పెట్టింది. దీంతో ఇప్పుడు గత బీఆర్‌ఎస ప్రభుత్వం విద్య, ఉద్యోగాలకు ఏం చేసింది.. కాంగ్రెస్‌ ఏం చేయబోతుంది అన్న చర్చ జరుగుతోంది.

    మేనిఫెస్టోలోనే జాబ్‌ క్యాలెండర్‌..
    కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలోనే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. ఏప్రిల్‌ ఒకటిన గ్రూప్‌–2 నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని తేదీలతో సహా మేనిఫెస్టోలో పేర్కొనడం గమనార్హం. జూన్‌ 1న గ్రూప్‌–3, గ్రూప్‌–4 నియామకాలకు నోటిఫికేషన్‌ వెల్లడిస్తామని తెలిపింది. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు విడతల్లో 2 లక్షల ఉద్యోగాలను పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా భర్తీ చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

    విద్యకు ప్రాదాన్యం..
    ఇక విద్యకు కూడా ప్రాధాన్యం ఇస్తామని కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పేర్కొంది. ఇందులో భాగంగా మండలానికో కేంద్రీయ విద్యాలయం పాఠశాల ఏర్పాటు చేస్తామని ప్రకటిచింది. విద్యార్థుల ఉన్నత చదువులకు ఆటంకం కలుగకుండా రూ.5 లక్షల గ్యారెంటీ కార్డులు ఇస్తామని తెలిపింది. విద్యార్థినులకు స్కూటీలు కూడా ఇస్తామని హామీ ఇచ్చింది.

    గతంలో ఉద్యోగాలు లేకనే..
    గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని నిర్లక్ష్యం చేసింది. అంతేకాదు.. తామే ఎక్కువగా భర్తీ చేసినట్లు అహంకారంగా చెప్పడం నిరుద్యోగులను బాధించింది. వాస్తవంగా బీఆర్‌ఎస్‌ సర్కార్‌ పోలీస్‌ ఉద్యోగాల భర్తీకి మాత్రమే ఎక్కవ ప్రాధాన్యం ఇచ్చింది. గ్రూప్‌ ఉద్యోగాల భర్తీని నిర్లక్ష్యం చేసింది. ఉపాధ్యాయ ఖాలీలు ఉన్నా రిక్రూట్‌ చేయలేదు. గురుకులాలు ఏర్పాటు చేసినా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికనే భర్తీ చేసింది.

    గురుకులాల పెంపు..
    ఇక బీఆర్‌ఎస్‌ సర్కార్‌ గురుకులాలను భారీగా పెంచింది. అయితే కులం, మతం ప్రాతిపదికన గురుకులాలు ఏర్పాటు చేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. మరోవైపు గురుకులాల ఏర్పాటుతో ప్రభుత్వ పాఠశాలలు బలహీనపడ్డాయి. విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. భవనాలు శిథిలావస్థకు చేరాయి.ఉపాధ్యాయులు లేక విద్యార్థులు చదువులో వెనుకబడుతున్నారు.

    ఈ తరుణంలో కాంగ్రెస్‌ విద్య, ఉద్యోగాలకు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తుందన్న చర్చ జరుగుతోంది. మేనిఫెస్టో అమలు చేస్తే చాలా వరకు ఉద్యోగాలు భర్తీ అవుతాయని అంటున్నారు. ఇప్పటికే 18 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.