We are still in BRS: తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం వివాదాస్పదమైంది. 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు అధికర కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనిపై బీఆర్‌ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎన్నిక రద్దు చేయాలని కోరింది. కోర్టు చర్య తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను ఆదేశించింది. స్పీకర్ జాప్యం చేయడంతో బీఆర్‌ఎస్ నేతలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీం కోర్టు పార్టీ మారిన ఎమ్మెల్యేపై చర్యలకు గడువు విధించింది. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఇటీవలే నోటీసులు జారీ చేశారు. దీంతో పది మంది ఎమ్మెల్యేలు తాజాగా స్పీకర్ నోటీసులకు వివరాణ ఇచ్చారు. అయితే విశేషం ఏమిటంటే పది మంది ఎమ్మెల్యేల్లో 8 మంది తాము పార్టీ మారలేదని వివరణ ఇవ్వడం ఇప్పుడు ఆశ్చరకరంగా మారింది.
ఏం జరిగిందంటే..
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని ప్రతిపక్షం ఆరోపించింది. ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం, వారిని అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు గత జులై 31న తీర్పు ఇచ్చి, స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఆదేశాలు ఆలస్యాన్ని విమర్శించి, పార్లమెంట్‌కు ఈ విధానాన్ని పునర్విచారించాలని సూచించింది. ఫిబ్రవరి నుంచి నోటీసులు జారీ అయ్యాయి, ఇది రాజకీయ ఒత్తిడిని పెంచింది. ఈ కేసు రాష్ట్రంలో పార్టీ మార్పులకు ఆటంకం కల్పుతున్నట్లు కనిపిస్తోంది.
పార్టీ మార్పు లేదని దావా
ఎనిమిది మంది ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా స్పీకర్‌కు సమాధానాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం నియోజకవర్గాల అభివృద్ధి కోసమేనని, పార్టీ సభ్యత్వం మారలేదని చెప్పారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాలే యాదయ్య, గూడెం మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాంధీ వంటివారు బీఆర్‌ఎస్ సూత్రాలకు నిబద్ధులమని పేర్కొన్నారు. కొందరు తమ ఫొటోలను మార్ఫింగ్ చేశారని, సీఎంతో కలయికలు గౌరవార్థమేనని వివరించారు. ఇక దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం మరిన్ని రోజులు కావాలని కోరారు. 8 మంది ఎమ్మెల్యేకు ఇందుకు ఆధారాలు కూడా చూపించారు. స్పీకర్ వాటిని ఫిరాయింపు ఆరోపణలు చేసినవారికి పంపారు.
పదవులపై మాట మార్చిన నేతలు..
కొందరు ఎమ్మెల్యేలకు ప్రభుత్వ పదవులు లభించాయి. పోచారం శ్రీనివాస్‌రెడ్డికి వ్యవసాయ సలహాదారు పాత్ర, అరికెపూడి గాంధీకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ స్థానం ఇచ్చారు. ఇది బీఆర్‌ఎస్‌లో ఆగ్రహాన్ని రేకెత్తించింది. గతంలో అరికెపూడి గాంధీ బీఆర్‌ఎస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసి, పార్టీలో బ్రోకర్లు ఉన్నారని అన్నారు. కానీ ఇప్పుడు బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని చెప్పడం మాట మార్పుగా కనిపిస్తోంది. పాడి కౌశిక్‌రెడ్డి వంటి నాయకులు సవాల్ విసిరారు. ఈ పదవులు ఫిరాయింపు ఆరోపణలను మరింత బలపరుస్తున్నాయి, ఎందుకంటే అవి ప్రతిపక్షాలకు కేటాయించాల్సినవి.
వ్యక్తిగత విచారణ..
స్పీకర్ ప్రసాద్ కుమార్ ఒక్కొక్కరినీ విచారించనున్నారు. బీఆర్‌ఎస్ ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, న్యాయవాదులు హాజరుకావాలి. విచారణలు ఆలస్యం చేయకుండా చూడాలని స్పీకర్ హెచ్చరించారు. ఈ ప్రక్రియ బీఆర్‌ఎస్‌కు ప్రయోజనం కలిగించవచ్చు, ఎందుకంటే ఫిరాయింపులు ఆగిపోయాయి. మొత్తంగా, ఈ కేసులు తెలంగాణలో రాజకీయాలను మార్చవచ్చు. అనర్హత తీర్పు వచ్చిన తర్వాత ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇది కాంగ్రెస్ ఆధిపత్యాన్ని పరీక్షిస్తుంది. రాజ్యాంగపరమైన బాధ్యతలు, రాజకీయ అవకాశవాదం మధ్య సమతుల్యత అవసరమని ఈ సంఘటనలు సూచిస్తున్నాయి.