https://oktelugu.com/

Warning To The People Of Telangana: తెలంగాణ ప్రజలకు హెచ్చరిక.. ఈ సర్వేతో ఏం కానుంది?

దేశంలో రోజురోజుకూ సైబర్ ఫ్రాడ్స్ పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త అవకాశాలను వెతుకుతూనే ఉన్నారు. నిత్యం కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నారు

Written By:
  • Srinivas
  • , Updated On : November 8, 2024 3:58 pm
    Telangana

    Telangana

    Follow us on

    Warning To The People Of Telangana: దేశంలో రోజురోజుకూ సైబర్ ఫ్రాడ్స్ పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త అవకాశాలను వెతుకుతూనే ఉన్నారు. నిత్యం కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నారు. చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా.. బ్యాంకు అకౌంట్లలో బ్యాలెన్స్ ఉందంటే చాలు వారిని టార్గెట్ చేస్తున్నారు. వారి గురించి పూర్తి డేటా సేకరించి డబ్బులు కాజేస్తున్నారు. ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా, పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా సైబర్ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. అయితే.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే కొనసాగుతోంది. ఈ క్రమంలోనూ మరో కీలక అంశం తెరమీదకు వచ్చింది. సైబర్ నేరగాళ్లు కులగణన సర్వేను టార్గెట్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఓ ఫ్రాడ్ లింక్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ ఫోర్స్ పోలీసుులు హెచ్చరించారు.

    వీరు చెప్తున్న దాని ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 6న కులగణన సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది. దీనిని కొందరు సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. కుటుంబ సర్వే పేరుతో ఫ్రాడ్ లింక్స్‌ను పంపిస్తన్నారు. ఒకవేళ ఎవరైనా ఆ లింక్స్ నిజం అనుకొని క్లిక్ చేస్తే.. మీ ఖాతాలు ఖాళీ కావడ ఖాయం అని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా.. ఎవరైనా కుటుంబసర్వే కాల్స్ చేసి ఓటీపీలు అడిగినా ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పకూడదని సూచించారు. అధికారులే నేరుగా వచ్చి సర్వే చేస్తారని, ఎలాంటి ఆన్లైన్ ప్రాసెస్ ఉండదని అంటున్నారు. లింక్స్ పంపించి అందులో డేటా ఎంట్రీ చేయమని ప్రభుత్వం అడగదని సైబర్ సెక్యూరిటీ బ్యూరో వెల్లడించింది. సమగ్ర కుటుంబ సర్వే పేరిట ఎటువంటి ఫోన్ కాల్స్ రావని చెప్పింది. ఎవరూ అడిగినా ఓటీపీలు చెప్పకూడదని హెచ్చరించింది. సైబర్ నేరాల కట్టడిలో ప్రజల భాగస్వామ్యం అవసరమని సూచిస్తున్నారు.

    ఈ ఏడాది సైబర్ నేరాలు సైతం పెరిగినట్లు ఇటీవలే తెలంగాణ పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా.. 36 రకాల సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఉన్నత విద్యావంతులే ఈ ఉచ్చులో చిక్కుకుంటున్నారని తెలిపారు. ప్రజలు అత్యాశకు పోయి ఉన్న డబ్బులను కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కడో సుదూర ప్రాంతాల్లో కూర్చుని సైబర్ క్రైమ్‌కు పాల్పడుతున్నట్లుగా గుర్తించామని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిందేనని పలు సూచనలు చేశారు. అయితే.. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ సర్వే ప్రారంభం కావడం.. అందులో అన్ని రకాల వివరాలు సేకరించాలని ఉండడంతో.. మారుమూల పల్లెల్లోని ప్రజలు ఈ కాల్స్‌ను నిజమని నమ్మే అవకాశాలు లేకపోలేదు. సర్వే జరుగుతున్న క్రమంలో ఇలాంటి కాల్స్ ప్రభుత్వమే చేపించి ఉండొచ్చన్న నమ్మే ప్రమాదాలూ లేకపోలేదు. కొన్నికొన్ని సందర్భాల్లో సిటీ ప్రజలే మోసపోతున్నారు. ఇక అంతంత మాత్రంగానే చదువులు వచ్చే ఊరి ప్రజల పరిస్థితి ఏంటా అన్నది ఇప్పుడు చర్చగా మారింది. ఇప్పుడు అందరి చేతుల్లోనూ ఫోన్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఏయే కాల్స్ వస్తున్నాయో పల్లె ప్రజలు పెద్దగా గుర్తించకపోవచ్చు. ప్రభుత్వం నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పగానే వారు ఉన్న సమాచారమంతా చెప్పే అవకాశాలే ఉన్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.