Elon Musk: వచ్చే ఎన్నికల్లో ఆయన గెలవడు.. ట్రూడోకు షాక్‌ ఇచ్చిన మస్క్‌..!

ఖలిస్థానీ ఉగ్రవాది.. సిక్కు వేర్పాటువాది హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ హత్యను అడ్డం పెట్టుకుని భారత్‌పై ఆరోపణలు చేస్తున్న కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోకు ప్రపంచ కుబేరుడు మస్క్‌ షాక్‌ ఇచ్చాడు. వచ్చే ఏడాది ఎన్నికల్లో గెలవడని ప్రకటించారు.

Written By: Raj Shekar, Updated On : November 8, 2024 4:01 pm

Elon Musk(1)

Follow us on

Elon Musk: కెనడాలోని సిక్కు ఓటర్లను మచ్చిక చేసుకుని వచ్చే ఎన్నికల్లో గెలవానలి చూస్తున్న కెనడా ప్రధానికి ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో, ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ షాక్‌ ఇచ్చారు. వచ్చే ఏడాది కెనడాలో పార్లమెంటు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలపై మస్క్‌ జోష్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ట్రూడో నేతృత్వంలోని పార్టీ ఓడిపోతుందని తెలిపారు. ఈమేరకు ఓ ఎక్స్‌ యూజర అడిగిన ప్రశ్నకు రిప్లయ్‌ ఇచ్చారు. ట్రూడో.. సిక్కు వేర్పాటువాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ను రాజకీయం చేస్తోంది. అతను హత్యకు గురై ఏడాదైనా ఎలాంటి ఆధారం లేకుండా భారత్‌ ఏజెంట్లే హత్య చేశారని ఆరోపిస్తోంది. ఆధారాలు అడిగినా లేవంటూనే ఆరోపనణలు చేస్తోంది. తాజాగా మరోమారు ఈ విషయాన్ని ప్రస్తావించడంతో భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశాంగ శాఖ అధికారులను వెనక్కి రప్పించింది. భారత్‌లోని కెనడా విదేశాంగ కార్యదర్శులను బహిష్కరించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో అమెరికా కూడా దీనిలో జోక్యం చేసుకుంది. పరిణామాలను మనిస్తున్నామంటూనే, కెనడాకు మద్దతు తెలిపింది. భారత్‌ ఎదుగుదలను ఓర్వలేక కెనడాను అడ్డం పెట్టుకుని కొన్ని అగ్ర దేశాలు భారత్‌పై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నాయి. ఈ క్రమంలో ఎలన్‌ మస్క్‌ ట్రూడోకు షాక్‌ ఇచ్చే జోష్యం చెప్పారు.

ఎక్స్‌ యూజర్‌కు సమాధానం..
వచ్చే ఏడాది అక్టోబర్‌లో కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఓ ఎక్స్‌ యూజర్‌.. కెనడా ఎన్నికల్లో ట్రూడోను ఓడించేందుకు సాయం చేస్తారా అని ఎలాన మస్క్‌కు విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన మస్క్‌.. రాబోయే ఎన్నికల్లో ట్రూడో ఓడిపోతారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ తరఫున పియరీ పొయిలీవ్రే, న్యూ డెమోక్రటిక్‌ పార్టీ నుంచి జగ్మీత్‌సింగ్‌ నుంచి ట్రూడో గట్టి పోటీ ఎదుక్కొంటారని తెలిపారు. ఫలితంగా ట్రూడో అధికారం కోల్పోతారని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. ఈ విశ్లేషణలపై ఎక్స్‌ యూజర్‌ అడిగిన ప్రశ్నకు మస్క్‌ ఇలా సమాధానం చెప్పారు. మస్క్‌ గతంలో ట్రూడో ప్రభుత్వంపై విమర్శలు చేశారు ఫ్రీ స్పీచ్‌పై కెనడా ప్రభుత్వం అవలబిస్తున్న విధానాన్ని ఖండించారు. ప్రత్యేకంగా ప్రభుత్వ పర్యవేక్షణ కోసం ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ సేవలు నమోదు చేసుకోవాల్సిన కొత్త నిబంధనలను వ్యతిరేకించారు.