https://oktelugu.com/

Ghaati: ‘ఘాటీ’ గ్లిమ్స్ వీడియోలో అనుష్క చేతిలో ఉన్న ఆ తల ఎవరిదో తెలుసా..? డైరెక్టర్ క్రిష్ మామూలు ప్లానింగ్ తో లేడుగా!

గ్లిమ్స్ చివర్లో ఆ తల నరికే విధానం ఏమిటో, దానిని చేతిలో పట్టుకొని రావడం ఏంటో, తలచుకుంటేనే వళ్ళంతా గగురుపుడుతుంది కదూ. అయితే ఈ షాట్ లో అనుష్క చేత అంత క్రూరంగా చంపబడిన నటుడు ఎవరు?, కొత్త నటుడా లేదా పాపులర్ నటుడా అనే సందేహం మీ అందరిలో కలిగి ఉంటుంది.

Written By:
  • Vicky
  • , Updated On : November 8, 2024 / 03:55 PM IST

    Ghaati(1)

    Follow us on

    Ghaati: ‘మిస్ శెట్టి..మిస్టర్ పొలిశెట్టి’ చిత్రం తర్వాత అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఘాటీ’. ఈ సినిమా పై మొదట్లో అసలు అంచనాలు ఉండేవి కాదు. అనుష్క తో ఎదో మామూలు లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నాడని, అంతకు మించి ఏమి లేదని అందరూ అనుకున్నారు. కానీ నిన్న విడుదల చేసిన గ్లిమ్స్ వీడియోని చూసిన తర్వాత ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అనుష్క ని ఇప్పటి వరకు క్యూట్ గా అమాయకురాలిగా చూపించిన దర్శకులు ఉన్నారు, ఆమె రొమాంటిక్ గా హాట్ గా చూపించిన దర్శకులు ఉన్నారు, అదే విధంగా ఆమెను వీరోచితంగా చూపించిన దర్శకులు కూడా ఉన్నారు. కానీ అనుష్క లో క్రూరత్వాన్ని చూపించిన ఏకైక దర్శకుడిగా డైరెక్టర్ క్రిష్ చరిత్రలో నిలిచిపోతాడని చెప్పొచ్చు. ఇంత వయొలెన్స్ ఇటీవల కాలంలో పాన్ ఇండియన్ మాస్ హీరోల సినిమాల్లో కూడా జరగలేదు.

    అసలు గ్లిమ్స్ చివర్లో ఆ తల నరికే విధానం ఏమిటో, దానిని చేతిలో పట్టుకొని రావడం ఏంటో, తలచుకుంటేనే వళ్ళంతా గగురుపుడుతుంది కదూ. అయితే ఈ షాట్ లో అనుష్క చేత అంత క్రూరంగా చంపబడిన నటుడు ఎవరు?, కొత్త నటుడా లేదా పాపులర్ నటుడా అనే సందేహం మీ అందరిలో కలిగి ఉంటుంది. ఈ సన్నివేశంలో నటించింది ముమ్మాటికి పాత నటుడే. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్’ లో ఆడబిడ్డపై అత్యాచారం చేసిన గ్యాంగ్ మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అందులో వంశీ అనే నటుడు ఉంటాడు. ఈ చిత్రంతోనే అతను బాగా ఫేమస్ అవ్వడంతో, అందరూ అతన్ని టెంపర్ వంశీ అని పిలుస్తారు. ఈమధ్య కాలం లో ఈయన అనేక సూపర్ హిట్ సినిమాల్లో విలన్ గా , క్యారక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. ఈయనే ఇప్పుడు అనుష్క ఘాటీ చిత్రంలో కూడా నటించాడు.

    ఇక ఈ సినిమా డైరెక్టర్ క్రిష్ విషయానికి వస్తే, ఎంతో సున్నితమైన సినిమాలు తీస్తూ కెరీర్ ని నెట్టుకొచ్చిన ఈయనతో ఇంత వయొలెంట్ యాంగిల్ కూడా ఉందా అని ఆయన్ని అభిమానించే వాళ్ళు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసారు. పవన్ కళ్యాణ్ తో గత మూడేళ్ళ నుండి ‘హరి హర వీరమల్లు’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ బాగా ఆలస్యం అవుతూ ఉండడంతో, ఆ ప్రాజెక్ట్ నుండి క్రిష్ తప్పుకున్నాడు. బయటకి వచ్చిన తర్వాత ఆయన అనుష్క తో ఇలాంటి సినిమా చేసాడు. ఈమధ్య కాలం లో ‘ఘాటీ’ తరహా సినిమాలకు ఆడియన్స్ చెవులు కోసుకుంటున్నారు. భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుంటే ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్న రోజులివి. ‘ఘాటీ’ చిత్రం కూడా పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషన్ సృష్టించే అవకాశం ఉంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.