Doctor Akhila: అద్భుతం జరుగుతున్నప్పుడు ఎవరూ పట్టించుకోరు. అద్భుతం జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. చదువుతుంటే ఖలేజా సినిమాలో డైలాగ్ గుర్తుకొస్తుంది కదా. కానీ ఆ లేడీ డాక్టర్ అద్భుతం చేశారు. దానిని వైద్య సిబ్బంది చూశారు. ఆ తర్వాత ఆమె సృష్టించిన అద్భుతాన్ని రోగి బంధువులకు చూపించారు. వారు ఆమె చూపించిన తెగువను ప్రశంసించారు. కాళ్ళ మీద కూడా పడ్డారు. దీపావళి సందర్భంగా జరిగిన ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది.
ఆమె ఓ లేడీ డాక్టర్. పేరుపొందిన గైనకాలజిస్ట్. తన వృత్తి గత జీవితంలో ఎంతో మంది రోగాలను నయం చేశారు. ఎందుకంటే తను కూడా ఒక మహిళ కాబట్టి … తోటి మహిళలు పడే ఇబ్బంది ఎలా ఉంటుందో ఆమెకు తెలుసు కాబట్టి.. ఆమె మహిళల బాధలను అర్థం చేసుకొని.. వారి ఆర్థిక పరిస్థితి తగ్గట్టుగానే ట్రీట్మెంట్ చేస్తారు. రోగాలను నయం చేస్తారు. అందువల్లే ఆమెను లక్ష్మీ దేవతగా రోగులు పేర్కొంటుంటారు. ఎన్నో క్లిష్టమైన ఆపరేషన్ లను.. మరెన్నో ఇబ్బంది కరమైన రోగాలను నయం చేసిన ఆమె.. సరిగ్గా దీపావళి రోజు లక్ష్మీదేవతను ప్రపంచానికి పరిచయం చేశారు. ఎంతో క్లిష్టమైన ఆపరేషన్ చేసి తనలో ఉన్న అమ్మతనాన్ని మరోసారి నిరూపించారు.
ఆ లేడీ గైనకాలజిస్ట్ దీపావళి సందర్భంగా తన ఇంట్లో లక్ష్మీ పూజకు ఏర్పాటు చేస్తున్నారు. ఇంతలోనే హాస్పిటల్ నుంచి ఆమెకు ఎమర్జెన్సీ ఫోన్ కాల్ వచ్చింది. మిగతా డాక్టర్లు సెలవులో ఉన్నారు. దీంతో ఆమె వెంటనే ఆసుపత్రికి వెళ్లిపోయారు. పూజలు మధ్యలోనే పక్కన పెట్టడంతో కుటుంబ సభ్యులు వారించినప్పటికీ.. ఆమె ఏమాత్రం లెక్కపెట్టకుండా నేరుగా ఆసుపత్రికి వెళ్లిపోయారు. అక్కడ పురిటి నొప్పులతో ఓ నిండు గర్భిణి విలవిలలాడుతోంది. పైగా శిశువు పేగులను మెడకు చుట్టుకున్నట్టు కనిపిస్తోంది. మరో మాటకు తావులేకుండా ఆ డాక్టర్ ఆపరేషన్ కు రెడీ అయ్యారు. క్లిష్ట పరిస్థితుల్లో సర్జరీ చేసి బిడ్డను బయటకు తీశారు.
ఆ బిడ్డలో కదలికలు లేకపోవడంతో మొదట్లో ఆ డాక్టర్ కూడా ఒకింత ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత తన నేర్పరితనాన్ని ప్రదర్శించి అటు తల్లిని.. బిడ్డను కాపాడారు. ఈ ఆపరేషన్ తర్వాత ఆ లేడీ డాక్టర్ ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాలలో పంచుకున్నారు. దీపావళి సందర్భంగా లక్ష్మీదేవికి ప్రాణం పోశానని ఆమె ట్వీట్ చేశారు. ఇంతటి క్లిష్టమైన ఆపరేషన్ చేసిన ఆ డాక్టర్ పేరు డాక్టర్ అఖిల.. ఆమె ఐడి లో తెలుగులో పేరు ఉండడంతో ఆమె తెలుగు మహిళ అని అర్థమవుతోంది. ఈ సంఘటన ఢిల్లీ నగరంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ డాక్టర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో విస్తృతంగా సర్కులేట్ అవుతోంది.
Just did an emergency C-section and saved another Lakshmi Devi today. Since it’s Diwali and many doctors are on leave, I was called in for an emergency — the mother hadn’t felt any fetal movements since morning, and the baby had a double loop of cord around the neck.
Leaving my… pic.twitter.com/0dJa9lSQ2R— Dr.Akhi_The Gynesaur అఖిల (@Akhila_doc) October 20, 2025