HomeతెలంగాణCP Sajjanar: ప్రతిపక్షంలో డ్రంక్‌ డ్రైవ్‌ పై పెద్దమాటలు.. అధికారంలో ఇదేం తీరు రేవంత్‌ సార్‌?

CP Sajjanar: ప్రతిపక్షంలో డ్రంక్‌ డ్రైవ్‌ పై పెద్దమాటలు.. అధికారంలో ఇదేం తీరు రేవంత్‌ సార్‌?

CP Sajjanar: న్యూ ఇయర్‌ వేడుకల కౌంట్‌ డౌన్‌ ప్రారంభమైంది. కొత్త వేడుకలకు చిన్న పెద్ద అంతా సిద్ధమవుతున్నారు. మరోవైపు వేడుకలు ప్రశాంతంగా జరుపుకునేలా పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్‌ లో ఉత్సవాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ సజ్జనార్, కొత్త సంవత్సర ఉత్సవాల సమయంలో ట్రాఫిక్‌ రూల్స్‌ు కచ్చితంగా పాటించాలని పౌరులకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు.

120 ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు..
డిసెంబర్‌ 31 రాత్రి నగరంలో 120 ముఖ్య ప్రాంతాల్లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ చెక్‌పాయింట్లు ఏర్పాటు చేస్తున్నామని సజ్జనార్‌ పేర్కొన్నారు. ఈ చర్యలు పండుగ వాతావరణంలో పెరిగే రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఉద్దేశించినవి. ట్రాఫిక్‌ పోలీసులు అధిక సంఖ్యలో మోహరించి ఉంటారు.

నాడు అట్ల.. నేడు ఇట్ల..
ఇదిలా ఉంటే.. రేవంత్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డ్రంకెన్‌ డ్రైవ్‌పై అప్పటి కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇష్టానుసారం ధూషించారు. పిల్లగాండ్లు మందుతాగి పోతే.. డ్రంకెన్‌ డ్రైవ్‌ పేరుతో డబ్లు గుంచుతుండ్రు అని ఓ బహిరంగ సభలో డ్రంకెన్‌ డ్రైవ్‌ తీరుపై మండిపడ్డారు. కానీ ఇప్పుడు అధికారంలోకి రాగానే, న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు విధించారు. దీనిపై పాత వీడియోతో నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. అప్పుడు అట్ల.. ఇప్పుడు ఇట్ల అని కామెంట్‌ చేస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Gulf Tensions : గల్ఫ్‌ ఉద్రిక్తతలు తీవ్రం.. ఇరాన్‌పై చిన్న దేశాల వ్యూహాత్మక దాడులు!

Gulf Tensions : పశ్చిమాసియా మళ్లీ అగ్నిగుండంలా మారుతోంది. అమెరికా–ఇజ్రాయెల్‌తో ఇరాన్‌ మధ్య ఘర్షణలు విస్తరిస్తుండగా, గల్ఫ్‌ ప్రాంత దేశాలు నేరుగా తమ ప్రమేయం లేకపోయినా బాధిత దేశాలుగా మారాయి. అమెరికాకు స్థావరాలు...

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
Oktelugu Epaper
Exit mobile version