Homeఅంతర్జాతీయంH-1B Visa: ట్రంప్ కొంప ముంచేశాడు.. ఎంత ఎక్కువ జీతం ఉంటే అంత ఎక్కువ హెచ్1బీలు

H-1B Visa: ట్రంప్ కొంప ముంచేశాడు.. ఎంత ఎక్కువ జీతం ఉంటే అంత ఎక్కువ హెచ్1బీలు

H-1B Visa: అగ్రరాజ్యం అమెరికా విదేశీ ఉద్యోగులను తగ్గిస్తోంది. డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడు అయ్యాక విదేశీ ఉద్యోగులపై కక్ష గట్డాడు. ముఖ్యంగా భారతీయులను వెళ్లగొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో హెచ్‌–1బీ వీసా నిబంధనలు కఠినతరం చేశారు. వీసా ఫీజు రూ.లక్ష డాలర్లకు పెంచారు. తాజాగా వీసా కేటాయింపు ప్రక్రియలో ర్యాండమ్‌ లాటరీ వ్యవస్థను మార్చి, వేతనం, నైపుణ్యాల ఆధారంగా జారీ చేయాలని నిర్ణయించారు. ఈ మార్పులు ఫెడరల్‌ రిజిస్టర్‌లో ప్రచురితమయ్యాయి. 2027 ఆర్థిక సంవత్సరం క్యాప్‌ రిజిస్ట్రేషన్‌ నుంచి (ఫిబ్రవరి 27 నుంచి) అమలవుతాయి. ఇకపై అధిక వేతనాలు పొందే నిపుణులకు ఎంపిక అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.

వేతన స్థాయుల విభజన ఇలా..
అమెరికా కార్మిక శాఖ, హెచ్‌–1బీ ఉద్యోగుల వేతనాలను నాలుగు లెవల్స్‌గా వర్గీకరించింది.
– ఎంట్రీ–లెవల్‌ వర్కర్లు – ర్యాండమ్‌ లాటరీలో ఒక్కసారి మాత్రమే పాల్గొంటారు (ఛాన్స్‌ 15% తగ్గుతుంది)
– మధ్యస్థ నైపుణ్యం – రెండుసార్లు ఎంపిక అవకాశం (31% ఛాన్స్‌).
– అధిక నైపుణ్యం – మూడుసార్లు ప్రవేశం (46% అవకాశం).
– అత్యధిక వేతనం – నలుసార్లు లాటరీలో పాల్గొనవచ్చు (61% ఎంపిక ఛాన్స్‌).

అమెరికా ఎంబసీ, కఠిన వీసా నియమాలు, సోషల్‌ మీడియా తపాసులు,
హెచ్‌–1బీ/హెచ్‌–4 అపాయింట్‌మెంట్‌ ఆలస్యాలతో భారతీయ వలసదారులు ఇబ్బంది పడుతున్నారు. చట్ట ఉల్లంఘనలకు క్రిమినల్‌ కేసులు, జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. ట్రంప్‌ పరిపాలన అక్రమ వలసలను అరికట్టి, సరిహద్దులు, పౌరుల భద్రతకు కట్టుబడి ఉందని స్పష్టం చేసింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

Maruti Suzuki Brezza: మారుతి సుజుకీ Brezza.. ఇప్పుడు ఫేస్ లిప్ట్ లో.. ఎలా ఉండబోతుందంటే..

Maruti Suzuki Brezza: ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకీ కార్ల కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. మిడిల్ క్లాస్ నుంచి ఉన్నత వర్గాల వరకు అనుకూలమైన కార్లు ఈ కంపెనీ అందిస్తుందని కొందరి...

Today Horoscope: ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న డబ్బు వసూలు..

Today Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి కొన్ని రాశుల వారు...

Today horoscope in telugu 26.7.2026 : ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న...

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి...

Gulf Tensions : గల్ఫ్‌ ఉద్రిక్తతలు తీవ్రం.. ఇరాన్‌పై చిన్న దేశాల వ్యూహాత్మక దాడులు!

Gulf Tensions : పశ్చిమాసియా మళ్లీ అగ్నిగుండంలా మారుతోంది. అమెరికా–ఇజ్రాయెల్‌తో ఇరాన్‌ మధ్య ఘర్షణలు విస్తరిస్తుండగా, గల్ఫ్‌ ప్రాంత దేశాలు నేరుగా తమ ప్రమేయం లేకపోయినా బాధిత దేశాలుగా మారాయి. అమెరికాకు స్థావరాలు...

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Oktelugu Epaper
Exit mobile version